సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ వ్యక్తిగతం.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MAA President Manchu Vishnu Sensational Comments on CM Jagan and Megastar Chiranjeevi Meet

ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం సినిమా టికెట్ల రేట్ల విషయమై ప్రభుత్వానికి.. పరిశ్రమకు మధ్య వివాదం నెలకొన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ సమస్యపై ఈమధ్యే ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. టికెట్ల రేట్ల విషయమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని పలు సమస్యలపై కూడా ఈ భేటీలో చ‌ర్చించినట్లు తర్వాత మెగాస్టార్ తెలిపారు. అయితే, తాజాగా.. ఈ భేటీపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం జగన్‌ ని మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారు. అది కేవలం వ్యక్తిగత సమావేశంగానే భావిస్తున్నా. దానిని అసోసియేషన్‌ మీటింగ్‌గా భావించకూడదు’ అని విష్ణు తెలిపారు. ఈరోజు తిరుప‌తిలో మంచు విష్ణు మీడియా స‌మావేశం నిర్వ‌హించి ప‌లు అంశాలపై మాట్లాడారు. ఈక్రమంలోనే ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అలాగే, టికెట్‌ రేట్ల గురించి ప్రభుత్వంతో చర్చించడానికి ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి ఉంది. వారు ఎలా సూచిస్తే మేం అలా నడుస్తాం. ‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడకూడదు. ఇండస్ట్రీ తరపున అందరం కలిసి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఆయ‌న చెప్పారు. ఈ సందర్భంగా.. టికెట్ల ధరలపై సినీ ప‌రిశ్ర‌మ మొత్తం ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు. వ్యక్తిగతంగా ఎవరూ తన అభిప్రాయం అడగ లేదని మంచు విష్ణు తెలిపారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచార‌ని.. అదే సమయంలో ఏపీలో త‌గ్గించార‌ని విష్ణు గుర్తు చేశారు. రెండు ప్ర‌భుత్వాలు సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తున్నాయ‌ని మంచు విష్ణు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =