జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను, జనసేన పార్టీని నమ్మి..పవన్‌కు తోడుగా ఎంతో కష్టపడిన కీలక నేతలలో అనుశ్రీ సత్యనారాయణ పేరు ముందే ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, నాగబాబుకు అనుశ్రీ సత్యనారాయణ సన్నిహితుడు అయినా కూడా..కూటమి పొత్తుల లెక్కల వల్ల ఈ సారి ఎన్నికలలో జనసేన నుంచి టికెట్ దక్కలేదు.
రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అయిన అనుశ్రీ సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడి ఆదిరెడ్డి వాసును గెలిపించడం వెనుక ఉన్నారు. జనసేన, టీడీపీ నేతల పరస్పర సహకారం వల్ల సుమారు 70 వేల ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి వాసు ఈ ఎన్నికలలో గెలిచారు.అయితే 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అనుశ్రీ సత్యనారాయణ..అప్పుడు విజయం సాధించకపోయినా ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. కూటమి వల్ల సీటును వదులుకున్న అనుశ్రీ సత్యనారాయణకు.. ఇప్పుడు ఏదో ఒక పదవి వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎన్నాళ్ల నుంచో పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడిన ఈ నేతకు పవన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలన్న వాదన కూడా వినిపిస్తోంది.
జనసేన తరపున ఇప్పుడు ఎవరికి పదవి దక్కినా దక్కకపోయినా సరే.. అనుశ్రీ సత్యనారాయణకు మాత్రం పదవి దక్కేలా పవన్ కళ్యాణ్ చూడాలనే వాదన ఇప్పుడు తెరమీదకు వస్తుంది.అప్పుడే పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే భావన జనసైనికుల్లో కలుగుతుందనే న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు 2029 ఎన్నికలలో ఏపీలో జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దాని కంటే ముందే అనుశ్రీ సత్యనారాయణకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
సత్యనారాయణకు ప్రాధాన్యత ఉన్న పదవివి ఇవ్వడం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలన్న వాదన వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు కూడా న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత సీఎంకు ఉందన్న మాట తెరమీదకు వస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోవడంతో పాటు..అధికార వైసీపీ ఘోర పరాజయం పాలయి టీడీపీ అధికారంలోకి రావడం వెనుక జనసేన పార్టీ ఉందన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికీ మరచిపోకూడదనే కామెంట్లు ఇటు సోషల్ మీడియాలోనూ కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ