ఓవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్ వెనుకబడితే.. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అటు భారతీయ జనాతా పార్టీ కూచుకుని కూర్చుంది. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. పార్టీని బోలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమవైపు లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ను లూటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అయిదుగురు నేతలు కాంగ్రెస్ చేరారు. వారిలో ఇద్దరికి మంత్రి పదవి ఖాయమనే చర్చ తెరపైకి వచ్చింది. మంత్రి వర్గ విస్తరణపై గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఇచ్చే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి చేరిన అయిదుగురులో ఎవరెవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎన్నికల ముందే బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. భద్రాచలం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీలోకి జంప్ అయ్యారు. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. తన కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకొని తీరారు.
కొద్దిరోజుల క్రితం మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయిన చేరిన రెండు రోజులకే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం పోచారం మంత్రి పదవి వద్దంటున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఆయన పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక మిగిలిన ఒక పదవిని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లేదా దానం నాగేందర్‌కు ఇచ్చే అవకాశ ఉందని అంటున్నారు. వరంగల్‌లో మంచి పట్టున్న నేత కడియం. లోక్ సభ ఎన్నికల్లో కూడా తన కూతురును ఎంపీగా గెలిపించుకొని తీరారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. అందువల్ల దానం కంటే కడియం శ్రీహరికే మంత్రి పదవి దక్క అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE