కోదండరామ్ తో భేటీ అయిన కాంగ్రెస్ నాయకులు

Congress Leaders Meet Kodandaram, Congress Leaders Meet Kodandaram To Discuss Huzurnagar By-election, Congress Leaders Meet Kodandaram To Discuss Huzurnagar Bypoll, Huzurnagar Assembly Bypoll, Huzurnagar Assembly constituency bypoll, Huzurnagar Bypoll latest updates, Huzurnagar constituency bypoll, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈసారి హుజూర్‌నగర్‌ లో ఎలాగైనా గెలవాలని అధికార పక్షం త్రీవంగా ప్రచారం చేస్తూ ఉండడంతో, సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు వేగవంతం చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలు, పక్షాలకు చెందిన ఓట్లను రాబట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి, ప్రసాద్ కుమార్ తదితరులు సమావేశయ్యారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలని కోరారు.

అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జన సమితి తమకు మద్దతిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతిచ్చే అంశంపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని కోదండరామ్ వెల్లడించారు. మరోవైపు టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే సీపీఐ మద్దతు కోరుతూ చాడ వెంకట రెడ్డిని కలువగా, దీనిపై పార్టీలో చర్చించి మంగళవారం నాడు నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలకు నామినేషన్ పక్రియ సోమవారంతో ముగిసింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో నిజామాబాద్ నియోజక వర్గంలో అత్యధికంగా నామినేషన్స్ నమోదయ్యాయి. నిజామాబాద్ తరువాత ఇప్పుడు హుజూర్‌నగర్‌ అధిక సంఖ్యలో 76 మంది నామినేషన్స్ దాఖలు చేసారు. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్‌, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here