
అమర్‌నాథ్ యాత్ర 2024 ఈ రోజు అంటే జూన్ 29న ప్రారంభమయింది. జమ్మూకశ్మీర్ గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు పవిత్ర గుహ దర్శనం కోసం బయలుదేరారు. దీంతో ఆ ప్రాంతం అంతా భం భం భోళే, హర హర మహాదేవ్ అనే నినాదాలతో మారుమోగుతోంది.
పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీనగర్ నుంచి 15 కి.మీ దూరంలో సుమారు 13వేల అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహకు చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. అంటే జూన్ 29 నుంచి ప్రారంభమైన ఈ తీర్ధయాత్ర 52 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 19 న ముగుస్తుంది. ప్రతి ఏటా లక్షలాది మంది శివ భక్తులు అమర్ నాథ్ యాత్రకు వెళ్తుంటారు. హిందూ మతంలో అమర్‌నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమర్ నాథ్ పుణ్యక్షేత్రం ప్రాముఖ్యత అనేక మత గ్రంథాలలో కూడా ప్రస్తావించారు. పార్వతీమాతకి పరమశివుడు ఎన్నో రహస్యాలు చెప్పిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతాయి.
మరోవైపు పుణ్యక్షేత్రం బోర్డు ..మొట్టమొదటిసారిగా వైద్య ఏర్పాట్లను పెద్ద ఎత్తను పెంచింది. 100 ఐసీయూ పడకలు, అధునాతన పరికరాలు, ఎక్స్‌రే, అల్ట్రాసోనోగ్రఫీ మెషీన్, క్రిటికల్ కేర్ డాక్టర్లు, కార్డియాక్ మానిటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌తో కూడిన రెండు క్యాంపు హాస్పిటల్స్‌ను బాల్తాల్, చందన్‌బరిలో సిద్ధం చేసింది. అంతేకాకుండా యాత్ర ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టటి.. ఈయాత్రలో ఇబ్బంది పడే భక్తుల కోసం 100 శాశ్వత ఆక్సిజన్ బూత్‌లు, మొబైల్ ఆక్సిజన్ కేంద్రాలు కూడా సిద్ధం చేశారు.
అంతేకాకుండా అమర్‌నాథ్ యాత్ర కోసం పోలీసులు మరింతగా భద్రతను కట్టుదిట్టం చేశారు. హై సెక్యూరిటీ పాయింట్ల వద్ద ..భక్తుల కోసం 13 పోలీసు బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 11, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 8, బీఎస్‌ఎఫ్‌కు చెందిన 4, సీఆర్‌పిఎఫ్‌కు చెందిన రెండు బృందాలు మోహరించాయి. దీంతోపాటు ట్రాఫిక్‌ను ఎక్కడిక్కడ పర్యవేక్షించడం కోసం ఉదంపూర్ నుంచి బనిహాల్ వరకు 10 హై ఎండ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE