మరోసారి నేషనల్ క్రష్ అభిమానులకు షాక్

Rashmika is again a victim of deep fake video,Rashmika is again a victim,victim of deep fake video,Rashmika , victim of fake video, Rashmika deep fake video, shock for National Crush fans,Mango News,Mango News Telugu,National Crush fans News Today,National Crush fans Latest News,National Crush fans Latest Updates,Rashmika Live News,Rashmika Live Updates
Rashmika , victim of deep fake video, Rashmika deep fake video, shock for National Crush fans

మరోసారి డీప్ ఫేక్ వీడియోకు హీరోయిన్ రష్మిక మందన్నా బలయింది. పొట్టి బట్టలతో లోనెక్ టాప్‌తో క్లివేజ్ కనిపించేలా  లిఫ్టులోకి వెళుతున్న  రష్మిక మందన్నా వీడియో నెల రోజుల క్రితం పెద్ద  సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఉన్నది మొదట రష్మికనే అనుకున్నారంతా. జాతీయ స్థాయిలో ట్రెండ్ అయిన ఈ వీడియా.. తర్వాత అది డీప్ ఫేక్ వీడియో అని తేలేసరికి షాక్ అయ్యారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రష్మిక్ మందన్నా ఫేస్ మార్ఫింగ్ చేసి ఆ వీడియోను తయారుచేశారు.చివరకు ఆ వీడియోలో ఉన్న అమ్మాయి జారా పటేల్ అనే ఇన్ ఫ్లూయెన్సర్ అని తేలడంతో రష్మిక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జారా పటేల్ కూడా స్పందించి … ఆ వీడియోలో ఉన్నది తానేనని చెప్పుకొచ్చింది. ఆ తరువాత కొంత మంది సెలెబ్రిటీలు  కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు.

ఇప్పుడు మళ్లీ రష్మిక డీప్ ఫేక్ వీడియో బయటికి వచ్చింది. ఇందులో కూడా క్లీవేజ్ షోతో కనిపిస్తున్న నేషనల్ క్రష్‌ను చూసి మరోసారి అభిమానులు షాక్ అవుతున్నారు. కాకపోతే ముందున్న ఒక అనుభవంతో ఇది డీప్ ఫేక్ వీడియో అని తేల్చేసారు.  డీప్ ఫేక్ వీడియో బారిన మళ్లీ రష్మిక పడడంతో ఆమె అభిమానులకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే రష్మికకు బ్యాడ్ నేమ్ తేవడానికి ఎవరో ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

నెల రోజుల క్రితం విడుదలై డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇలాంటి పనులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. అయినా మరోసారి రష్మిక వీడియో రావడం హాట్ టాపిక్ అయింది. గత నెలలో రష్మిక డీప్ ఫేక్ వీడియో షాక్ నుంచి తేరుకోకముందే.. మరో వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడం నిజంగా బాధాకరమే.  నిజానికి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్ లైన్లో ఆడవాళ్ల సెక్యూరిటీకే సవాల్ విసురుతోంది.

గతంలో రష్మిక ఇష్యూపై   అమితాబ్ బచ్చన్ తో సహా ఎంతో మంది సెలెబ్రిటీలు స్పందించారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా సోషల్ మీడియా సంస్థలు దీనిపై కఠినంగా వ్యవహరించాలని  హెచ్చరించింది. అయినా సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోవడంతో అదికూడా రష్మికనే మళ్లీ టార్గెట్ చేయడం  ఆందోళన కలిగించే విషయమే.

మరోవైపు ఈ వీడియో రష్మిక ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. యానిమల్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుని  నిజంగానే నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలోనూ నటిస్తోన్న రష్మిక..  గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో… ఇలా వరుస సినిమాలను చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =