
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన అంశాలపై చర్చించుకుందామంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయగా.. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు జవాబు రాయడం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఆసక్తిని రేపుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కార మార్గాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు.
దీనిలో భాగంగానే జులై 6న సమావేశమవుదామని జులై 1న రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు దాటినా కూడా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని.. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. పరస్పర సహకారంతో ఈ సమస్యలు పరిష్కరించుకుందామని కోరారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన తెలంగాణ సీఎం.. జులై 6న భేటీకి సిద్ధమని లేఖ రాశారు. దీనికోసం ప్రజాభవన్‌లో చర్చలకు చంద్రబాబును ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని లేఖలో చెప్పారు. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం నిజంగా చాలా అవసరమన్నారు రేవంత్ రెడ్డి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానుండం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇటు ఈ సమావేశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా.. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు.. తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైనా ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో మంత్రులు చర్చిస్తున్నారు. రోడ్లు,భవనాల శాఖకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అలాగే దీనిపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే జులై 6న జరగబోతున్న తెలంగాణ, ఏపీ సీఎంల భేటీలో ..పదేళ్లుగా అలాగే ఉండిపోయిన సమస్యలకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY