
అన్ని వయసుల వాళ్లకు వాకింగ్ మంచిదే. కొంతమంది తమ వీలును బట్టి ఉదయాన్నే వాకింగ్ చేస్తే.. మరికొంతమంది సాయంత్రం నడుస్తూ ఉంటారు. అయితే చాలామంది భోజనం చేసిన వెంటనే నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటుంటే.. లేదు లేదు భోజనం చేశాక ఓ 15 నిమిషాలు అయినా గ్యాప్ ఇవ్వాలి అంటుంటారు.
నిజమే భోజనం చేసిన వెంటనే కాకుండా కాస్త విరామం ఇచ్చి నడిస్తే బోలెడు ప్రయోజనాలుంటాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. తిన్న తర్వాత, ఒక చిన్న నడక వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలెన్నో పొందొచ్చు. తిన్న తర్వాత నడిస్తే ముఖ్యంగా 5 ప్రయోజనాలుంటాయని అంటున్నారు. తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నడక కడుపు కండరాలు, ప్రేగులను ప్రేరేపించడం వల్ల జీర్ణక్రియకు సాయపడుతుంది. నడక ఆహారం వేగంగా జీర్ణమవడానికి వీలు కల్పిస్తుంది. తిన్న వెంటనే నడిస్తే.. గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు భోజనం తర్వాత నడవడం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. భోజనం తర్వాత నడవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది. అంతేకాదు ఆ రోజంతా కూడా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో నడకను మించిన వ్యాయామం లేదు.
తిన్న వెంటనే నడిస్తే అది కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. నడక వల్ల తొందరగా బరువు తగ్గొచ్చు. అంతేకాదు నడక వల్ల మంచి మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. అలాగే, గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల రక్తపోటును నియంత్రించగలదని కొన్ని అధ్యయనాలు ప్రూవ్ చేశాయి. అలాగే హైపర్‌టెన్సివ్‌గా ఉంటే.. తిన్న వెంటనే ప్రతీ రోజూ తప్పకుండా నడిస్తే… ఆరోగ్యకరమైన రక్తపోటు ఉండేలా చేసుకోవచ్చు. తిన్న తర్వాత నడిస్తే బాడీలో హెవీనెస్ తగ్గి తేలికగా మారినట్లు ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తిన్న వెంటనే కాసేపు నడిస్తే చాలా మంచిది. తినడం తర్వాత నడవడం వల్ల జీర్ణ రుగ్మతలను తొలగించడమే కాకుండా మంచి నిద్రను కలిగించడానికి సాయపడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY