ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ ఎంత దూకుడుగా వ్యవహరించారో ఎన్నికల ఫలితాల తర్వాత అంతగా సైలెంట్ అయిపోయారు. అప్పుడు కళ్లల్లో, మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ ఇప్పుడు బూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. కానీ చెల్లెలు షర్మిల మాత్రం అప్పటికీ ఇప్పటికీ అదే ధైర్యంతో, అదే వ్యూహంతో దూసుకుపోతున్నారు. రిజల్ట్ తర్వాత కాస్త ఖంగుతిన్నా కూడా వెంటనే వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని చకచకా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఆ అన్నాచెల్లెళ్లలో ఎవరు బలమైన నేత అన్న చర్చ సాగుతుండగా ఎక్కువ మంది షర్మిల పేరునే చెప్పడం గమనార్హం. ఎందుకంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి.
ఎన్నిక లసమయంలో పీసీసీ చీఫ్ షర్మిల దూకుడుతో పోల్చుకుంటే జగన్ వెనుకబడ్డారనే చెప్పొచ్చు. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన కౌంటర్ ఇవ్వలేక పోయారు. పైగా.. చెల్లి అని కూడా చూడకుండా ధరించిన చీర రంగును ప్రస్తావించి ఇంకా దిగజారారు. ఆమె టీడీపీతో కుమ్మక్కయ్యారని జగన్ ఆరోపించినా కానీ, ప్రజలు మాత్రం నమ్మలేదు. అలా అప్పుడే షర్మిల దూకుడుకు సరైన విధంగా జగన్ బ్రేక్ పెట్టలేక పోయారు. అంతెందుకు వైఎస్ వారసత్వం గురించి ఎప్పుడు చర్చ అయినా..వైఎస్ జగన్ బలమైన ఎదురు దాడి చేయలేక పోయారు.
ఇక ఎన్నికల తర్వాత అయితే జగన్ సైలెంట్ అయిపోవడమే కాదు.. ఎవరికీ కనిపించకుండా.. పులివెందుల, బెంగళూరుల్లో రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. తాజాగా తాడేపల్లికి వచ్చారు. కానీ, ఈలోగానే షర్మిల రాజకీయ వ్యూహంలో రెండు అడుగులు వేసేశారు. రెండు కీలక విషయాలపై స్పందించి అన్నను, ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయాలంటూ..షర్మిల జగన్ ఏ మాత్రం ఊహించని విధంగా చంద్రబాబును ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో బీహార్ అడుగులు పడుతున్నాయని.. ఇదే సమయంలో ఏపీ కూడా స్పందించాలని షర్మిలల సూచించారు.
అంతేకాకుండా ఇటు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలను కూలదోస్తున్నారని.. ఇది అప్రజాస్వామికమని షర్మిల కూతురుగా, కాంగ్రెస్ నేతగా గళం వినిపించారు. కానీ, ఇటు జగన్ మాత్రం గవర్నర్కు ఓ లెటర్ రాసి మమ అనిపించేశారు. ఈ రెండూ ఒక ఎత్తు అయితే జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు సాగుతున్నారు. విజయవాడలో నిర్వహించనున్న భారీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే షర్మిల జాతీయస్థాయి నాయకులను ఆహ్వానిస్తున్నారు.కానీ జగన్ మాత్రం తండ్రి జయంతిని సాదాసీదాగా నిర్వహించడానికి రెడీ అవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అన్నాచెల్లెళ్ల మధ్య తారతమ్యాలను హైలెట్ చేస్తూ ఏపీలో పెద్ద ఎత్తన చర్చ సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE