రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం

Mango News Telugu, Tirumala Tirupati Devasthanams, TTD Approves Budget, TTD Board Approves Rs 3309 Crore Budget, TTD Board Budget, TTD Board Budget 2020, TTD Board Resolutions, TTD Latest News, TTD Trust Board
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఫిబ్రవరి 29, శనివారం నాడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. 2020-2021 సంవత్సరానికి గాను రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బడ్జెట్‌ అంచనాలు రూ.60 కోట్లకు పెరిగినట్టు పేర్కొన్నారు. హుండీ ద్వారా రూ.1,351 కోట్లు ఆదాయం, వడ్డీల ద్వారా రూ.706 కోట్లు, ఇక లడ్డు ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. సమావేశం అనంతరం బడ్జెట్‌కు సంబంధించిన పలు వివరాలను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

టీటీడీ పాలకమండలి వార్షిక బడ్జెట్‌ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు:

  • బుందీపోటులో తరుచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు నివారణకు రూ.3.30 కోట్లు
  • 34 కోట్లతో ఎస్వీ భజన పాఠశాల ఏర్పాటు
  • జూపార్క్‌ సమీపంలో రూ.14 కోట్లతో ప్రతిభావంతులకు శిక్షణా కేంద్రం ఏర్పాటు
  • అలిపిరి రోడ్డు విస్తరణ కోసం రూ.16 కోట్లు కేటాయింపు
  • బర్డ్‌ ఆస్పత్రిలో మెరగైన సదుపాయాలు కోసం రూ. 8.5 కోట్లు
  • టీటీడీ విజిలెన్స్‌ శాఖలో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల భర్తీ ఆమోదం
  • టీటీడీ ఆలయాలు, వాటి పరిధిలోని పబ్లిక్‌ ప్రాంతాల్లో 1500 సీసీ కెమెరాల ఏర్పాటు
  • చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ.3.92 కోట్లు కేటాయింపు
  • అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు రుసుం మినహాయింపు
  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం, వాహన మండపం నిర్మాణానికి ఆమోదం
  • జమ్మూకశ్మీర్‌, ముంబై, కాశీలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆమోదం
  • టీటీడీ సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయం. 

[subscribe]

Video thumbnail
Botsa Satyanarayana Questions Opposition Over Their Development In Last 5 Years | AP News |MangoNews
07:41
Video thumbnail
Devineni Uma Speaks About AP CM YS Jagan's Polavaram Visit In Press Meet | AP News | Mango News
06:09
Video thumbnail
Minister Avanthi Srinivas About People's Opinion Over Vizag As Capital | AP News | Mango News
06:09
Video thumbnail
TDP Leader Devineni Uma Slams CM YS Jagan Over Polavaram Project Issue | AP News | Mango News
08:19
Video thumbnail
Nara Lokesh Serious On AP Govt Over Chandrababu Vizag Tour Issue | AP Latest News | Mango News
05:09
Video thumbnail
Nara Lokesh Reveals Reasons Behind Blocking Chandrababu Naidu At Vizag Airport | AP News | MangoNews
05:12
Video thumbnail
Nara Lokesh Says Visakha Was Developed By Chandrababu Naidu | AP Latest Updates | Mango News
04:15
Video thumbnail
Chandrababu Naidu Protest At Visakhapatnam Airport | #TDPPrajaChaitanyaYatra | AP News | Mango News
03:28
Video thumbnail
YCP Activists Blocked Chandrababu Naidu At Visakha Airport | AP Latest Updates | Mango News
03:18
Video thumbnail
YCP Leaders Protest Against Chandrababu's Visakha Tour | AP Latest Updates | Mango News
04:28
Video thumbnail
Chandrababu Naidu About AP 3 Capital Issue In Press Meet | AP Political News| AP News | Mango News
07:41
Video thumbnail
Chandrababu Naidu Reveals Reasons Over Not Inviting CM YS Jagan For Dinner With Trump | Mango News
03:59
Video thumbnail
Chandrababu Naidu Strong Warning To YCP Govt In Press Meet | AP Latest News | Mango News
09:47
Video thumbnail
Chandrababu Naidu Speaks About Water Supply In Drought Areas | AP Latest News | Mango News
07:06
Video thumbnail
Chandrababu Naidu Meets His Childhood Friend In Kuppam | AP Latest News | Mango News
08:56
Video thumbnail
Chandrababu Naidu Gives Strong Assurance To Vendugampalli Village People | AP Latest News |MangoNews
03:08

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =