
ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే కరెంట్ ఆఫీసుకు వెళ్లి కట్టాల్సి వచ్చేది. తర్వాతర్వాత పేమెంట్ యాప్స్ అందరికీ అందుబాటులోకి రావడంతో విద్యుత్ బిల్లును ఆన్ లైన్లోనే చెల్లిస్తూ ఉండేవారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా నిబంధనలను విధించడంతో..ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌ల సాయంతో కరెంటు బిల్లును కట్టడానికి అవకాశం లేకుండా పోయింది.
యూపీఐ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లించడానికి వినియోగదారులకు అవకాశం లేకుండా ..జులై 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. దీంతో జులైలో వచ్చిన కరెంటు బిల్లును ఎలా చెల్లించాలో తెలీక చాలామంది ఇబ్బంది పడుతున్నారు.మరికొంతమంది అయితే కరెంట్ ఆఫీసులకు వెళ్లి తమ బిల్లులను చెల్లించారు.
అయితే పేమెంట్ యాప్స్‌లో బిల్లులు పేమెంట్ ఆపేసినా..ఆన్ లైన్‌లో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు. ఆన్ లైన్ పేమెంట్ యాప్స్‌కు బదులు.. హెల్ప్ డెస్క్ సాయంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ బిల్లులను స్వీకరిస్తుంది. ఉదాహరణకు తెలంగాణ పరిధిలో ఉన్నవారు బిల్లు కట్టాలంటే.. TGSPDCL యాప్ లేదా అధికారిక సైట్ https:// tgsouthernpower.org సైట్‌లోకి వెళ్లి పే యువర్ బిల్ అనే ఆప్షన్‌తో బిల్లు చెల్లించొచ్చు. ఈ సైట్ లేదా TGSPDCL యాప్ నుంచి యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసి డైరక్టుగా కరెంట్ బిల్లును చెల్లించొచ్చు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారయితే APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్ సైట్ ద్వారా తమ బిల్లులను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు చెల్లించొచ్చు. దీనికోసం సైట్ లేదా APCPDCL యాప్‌లో పే యువర్ బిల్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి బిల్ చెల్లించాలి. ఒకవేళ వెబ్ సైట్ నుంచి బిల్లు చెల్లించాలంటే మాత్రం బిల్ డెస్క్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అందులో యూనిక్ సర్వీస్ నెంబర్, క్యాప్చా నంబర్ ఎంటర్ చేయగానే.. బిల్లు వివరాలు మొత్తం వస్తాయి. పేమెంట్ కోసం క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును వాడి బిల్లు చెల్లించొచ్చు. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి కాబట్టి.. తెలుగు రాష్ట్రాలలో కరెంట్ బిల్లు చెల్లించడానికి యాప్ లేదా సైట్‌ను వాడి ఈజీగా బిల్లులు పేమెంట్ చేసుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY