హ‌మ్మ‌య్య‌.. బాబుకు బిగ్ రిలీఫ్‌

Chandrababu Naidu Got Bail,Chandrababu Got Bail,Naidu Got Bail,Mango News,Mango News Telugu,Chandrababu Naidu, Skill Development Scam Case, ACB Court, AP,High Court Gives Interim Bail,Chandrababu Naidu Granted Four Weeks Interim Bail,Skill Development Scam,Andhra HC Grants Interim Bail,Andhra Pradesh HC Grants Interim Bail,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Latest Updates,Chandrababu Naidu Live News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
chandrababu naidu, skill development scam case, acb court, ap

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట‌యిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు యాభై రోజులుగా జైలులోనే ఉన్నారు. అయితే.. ఆయ‌న అరెస్ట్ అయిన మొదటి వారం నుంచే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో అప్ప‌టి నుంచీ వైద్యులు, జైలు అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ.. వివ‌రాలు వెల్ల‌డిస్తున్నారు. అంతా బాగానే ఉంద‌ని చెబుతున్నారు. ఆయ‌నతో ములాఖ‌త్ అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులు మాత్రం ఆయ‌న ఆరోగ్యం, ఇత‌ర అంశాల‌పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు. బాబు ఆరోగ్యం బాగా లేద‌ని చెప్పేవారు. ఇప్పుడు అదే అంశాన్ని కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆయ‌న కొంత వెసులుబాటు క‌ల్పించింది. మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.

నారా చంద్ర‌బాబునాయుడుకు దాదాపు 53 రోజుల తర్వాత కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోరడంతో.. ఏపీ హైకోర్ట్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 10న ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 షరతులు వ‌ర్తిస్తాయి..

బెయిలు మంజూరు చేసినా న్యాయ‌స్థానం కొన్ని ష‌ర‌తుల‌ను విధించింది. లక్ష పూచీకత్తు, రెండు ష్యూరిటీలతో బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాకుండా.. ఆయ‌న ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని.. కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు తెలిపింది. అనారోగ్య కారణాలతో మంజూరు చేసినందువల్ల.. ఇల్లు, ఆస్పత్రికి మాత్రమే పరిమితం కావాలని తీర్పునిచ్చింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఉత్త‌ర్వులు ర‌ద్దు అవుతాయ‌ని పేర్కొంది. ఇదిలాఉండ‌గా.. చంద్రబాబుతో పాటు ఇద్దరు డీఎస్పీలను ఎస్పార్టులుగా ఉంచుతామ‌ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. జెడ్ ప్లస్ భద్రతపై కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని చెప్పింది. చంద్రబాబు భద్రత అంశంలో జోక్యం చేసుకోమని కోర్టు స‌ర్కారును ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + two =