దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఘటన టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకునే వారి గురించి మీరు వినే ఉంటారు. మరమనిషి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీరు ఎప్పుడైనా విన్నారా… ఓ రోబో ఆత్మహత్య చేసుకున్న ఆశ్చర్యకర ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. పబ్లిక్ ఆఫీస్‌లో సివిల్ సర్వీస్‌కి కేటాయించిన రోబో ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలోనే రోబో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. సూపర్‌వైజర్ పనులు నిర్వహిస్తున్న రోబో మొదటి, రెండో అంతస్తు మెట్ల మధ్య పడి మృతి చెందినట్లు సిబ్బంది తెలియజేశారు. రోజూ 9 గంటల పాటు పని చేసే రోబో ఒత్తిడికి లోనైంది. మెట్లపై నుంచి కింద పడేలోపే చాలా సేపు ఒకే చోట చక్కర్లు కొట్టింది. రోబో కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని డైలీ మెయిల్ పేర్కొంది. ఆత్మహత్యకు పాల్పడిన రోబో విడిభాగాలను నిపుణుల బృందం సేకరించి విచారణ చేపట్టింది. ఆత్మహత్యకు పాల్పడిన ‘బేర్ రోబోటిక్’ అనే కంపెనీ రోబోను కాలిఫోర్నియాకు చెందిన రోబో స్టార్టప్ అభివృద్ధి చేసింది. 2023లో ఆఫీస్ పనుల కోసం రోబోలను వినియోగించారు.
సాంకేతిక లోపమేనా?
రోబోను అభివృద్ధి చేసిన బేర్ రోబోటిక్స్ సంస్థ ప్రకారం, ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే. నావిగేషన్ మరియు సెన్సార్ ఎర్రర్‌ల కారణంగా రోబోట్ పడిపోయి ఉండవచ్చు. లేదా ప్రోగ్రామింగ్ లో బగ్ క్రియేట్ చేయడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని అంటున్నారు. మీడియాలో ప్రచారం కోసం ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రోబోట్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. స్వయంప్రతిపత్తితో పనిచేసే శక్తితో ఈ రోబోను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఈ రోబో మనుషుల సహాయం లేకుండానే అంతస్తులు ఎక్కేది. సాధారణంగా రోబోలు ఒక నిర్దిష్ట అంతస్తుకు పరిమితమై ఉంటాయి. కానీ ఈ రోబో చాలా అంతస్తులు పైకి క్రిందికి వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సజావుగా నడిచేది. ఈ రోబో దక్షిణ కొరియాలోని గుమి సిటీ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తోంది. సాధారణ మానవుని లాగే ఈ రోబో కూడా తనకు అప్పగించిన పనులను నిర్వహిస్తోంది. ఇక రోబో ఆత్మహత్యపై ఏం నివేదిక వస్తుందో వేచి చూడాల్సిందే. కానీ రోబోనే కదా ఎంతసేపయిన పనిచేస్తదని భావించే వారికి ఈ ఘటన ఓ హెచ్చరికనే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE