ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ వివరాలు

Free Sand Policy In AP From Today,Free Sand Policy,Sand Policy In AP From Today,Sand Policy In AP,AP,Sand Policy, Chandrababu, Online sand booking,sand booking,TDP,YS Jagan,pawan kalyan,YCP,Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
TDP, Chandrababu,Free sand policy in AP from today, YS Jagan, Sand is free in AP from today, Online sand booking

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు అంటే జులై 8 నుంచి అమలులోకి వస్తుంది. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే గనుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే.. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు  ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు.

దీని ప్రకారం ఈరోజు  ఉచిత ఇసుక విధానం ప్రారంభం కానుండటంతో.. సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర ఫీజులను ఆన్‌లైన్‌ విధానంలోనే  స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుకను విక్రయించి, నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణులున్నాయి. దీంతోనే  తమ ప్రభుత్వం  ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే రుసుములు స్వీకరిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం  వెల్లడించింది.

ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కోసం.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా కేవలం డిజిటల్‌ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యాచరణను రూపొందించారు. ఏపీ వ్యాప్తంగా మొదట 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాలలో జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నారు.  పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. డిజిటల్‌ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలను ఓపెన్‌ చేశారు. వీటన్నింటి కోసం జులై 8న  బ్యాంకులు క్యూఆర్‌ కోడ్‌‌ను కూడా మంజూరు చేస్తున్నాయి.

ఇసుక నిల్వ కేంద్రాలు ఏపీలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయన్న  సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఆ కేంద్రాలలో  ఎంతమేర ఇసుక అందుబాటులో ఉందనే సమాచారాన్ని కూడా  అప్‌డేట్‌ చేస్తుంటారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర గనుల శాఖ ఆదివారం నుంచి అంటే జులై 7 నుంచే తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల నేటి నుంచి 2వారాల వరకూ చేతి రాతతోనే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత మాత్రం బిల్లులను ఆన్ లైన్ లోనే పొందొచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE