సరిగ్గా 17 ఏళ్ల తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా… 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చుకుంది. దీంతో ఈ చారిత్రాత్మక విజయం తరువాత బీసీసీఐ సెక్రటరీ జై షా టీమ్ ఇండియాకు రూ.125 కోట్లు బహుమతిని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ 125 కోట్ల లో ఏ ఆటగాడకి ఎంత చెల్లిస్తారు. కెప్టెన్ రోహిత్ కు, కోహ్లీ కి ఎంత దక్కనుంది. జట్టులోని మిగతా సభ్యులకు దక్కేది ఎంత. మరి కోచ్ ద్రావిడ్ కు ఏమైనా వాటా లభిస్తుందా అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఆ 125 కోట్ల రూపాయలు కంప్లీట్ బ్రేకప్ అయ్యాయి, ఎవరికి ఎంత ఫ్రైజ్ మనీ వచ్చిందనే వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి.
అవును, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక దీని గురించి ఒక వార్తను ప్రచురించింది. ఐసిసి టి20 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన మొత్తం 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు లభిస్తాయని పేర్కొంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇతర ఆటగాళ్ల మాదిరిగానే ప్రైజ్ మనీని అందుకుంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్దీప్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్ష దీప్ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యజువేంద్ర ఛల్ 5 కోట్లు అందుకుంటారు.
అలాగే టీమిండియా విజయాల బాట పట్టేలా కీలక పాత్ర పోషించిన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా 5 కోట్ల రూపాయలు అందుకోనున్నారు. అతనితో పాటు కోచింగ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు రూ.2.5 కోట్లు అందజేయనున్నారు. ఇక్కడికి 87.5 కోట్లు పూర్తయ్యాయి. మిగిలిన రూ.37.5 కోట్ల ను టీమిండియా సపోర్టు స్టాఫ్, సెలక్షన్ కమిటీ, రిజర్వ్ ఆటగాళ్లకు కేటాయించారు.
ముగ్గురు ఫిజియోథెరపిస్ట్ లు, ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోషమ్ దేశాయ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు చెల్లించారు. పొందుతారు దీని తర్వాత రిజర్వ్ ఆటగాళ్లైన శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు ఒక్కొక్కరికి రూ.కోటి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందుతాయి. అలాగే, T20 ప్రపంచ కప్ గెలిచిన టీమ్ కు ఐసీసీ ప్రకటించిన 20.42 కోట్ల రూపాయలు కూడా టీమిండియా ఖాతాలోనికి రానున్నాయి. ఈ మొత్తం కూడా కేవలం ఆటగాళ్లకే కాకుండా కోచింగ్ స్టాఫ్, సపోర్టు స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రిజర్వ్ ఆటగాళ్లకు కూడా వర్తిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE