ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఏపీపై తిరిగి పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను బరిలోకి దింపింది. ఆమె ద్వారా పావులు కదుపుతోంది. ఏపీలో పార్టీకి పూర్వవైభవం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను తిరిగి తమవైపు మళ్లించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ 75వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో వైఎస్ షర్మిల పెద్ద ఎత్తున సభను నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వైఎస్సార్ తమవాడేనని చాటారు. వైఎస్సార్ పాలన.. సంక్షేమ రాజ్యాన్ని తీసుకురావడం కాంగ్రెస్‌తోనే సాధ్యమనే మెసేజ్‌ను జనాల్లోకి చొరగొట్ట ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వైఎస్సార్‌కు అసలైన వారసురాలు వైఎస్ షర్మిల అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ సభకు హాజరయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పంచ్‌లు వేశారు. విమర్శలు గుప్పించారు. కుటుంబ సభ్యులుగా పుట్టినంత మాత్రాన వారసులు కాదని అన్న రేవంత్ రెడ్డి.. ఆయన ఆశయాలు మేసేవారే నిజమైన వారసులని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు చెప్పుకొని కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. వారంతా ఆయన వారసులు కారు.. కాలేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసురాలు వైఎస్ షర్మిల అని స్పష్టం చేశారు. పరోక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ పొలిటికల్ పంచ్‌లు వేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.
ఇక అంతేకాకుండా.. ఏపీలో కాంగ్రెస్ సర్పంచ్ పదవిని కూడా గెలిచే పరిస్థితిలో లేదని.. అది చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ జెండా మోసేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు. ముల్లబాటను ఎంచుకొని షర్మిల ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల ఎంతగానో తపన పడుతున్నారని తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా సుదీర్ఘ పోరాటం చేసి 2004లో ముఖ్యమంత్రి అయ్యారని.. షర్మిల కూడా 2029లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని వెల్లడంచారు. అటు 2029 నాటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని అవుతారని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం రెండూ వైఎస్సార్ కోరికలు అని రేవంత్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE