తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్

It Seems That The Telangana Government Will Appoint Jitender As The New DGP Of Telangana,Jitender As The New DGP Of Telangana,Telangana Government Will Appoint Jitender As The New DGP,Telangana DGP is Jitendern,Telangana Government, Jitender As The New DGP,Jitender,Telangana,DGP,New DGP Of Telangana, CM Revanth Reddy,Congress,Telangana,Telangana politics,telangana live updates,KCR,Telangana,Mango News, Mango News Telugu
telangana, telangana dgp, jitender reddy, cm revanth reddy

గతేడాది ఎన్నిక వేళ తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే.. అంజనీ కుమార్ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈక్రమంలో క్రమశిక్షణ చర్యల కింద అంజనీ కుమార్‌ను డీజీపీ పదవి నుంచి ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రవి గుప్తా తెలంగాణ డీజీపీగ నియమితులయ్యారు. అయితే ఇప్పుడు రవి గుప్తాను కూడా డీజీపీ పదవి నుంచి తొలగించి మరో డైనమిక్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికే కొత్త డీజీపీని రేవంత్ రెడ్డి ఎంపిక చేశారట. తెలంగాణ కొత్త డీజీపీగా ఐపీఎస్ అధికారి జితేందర్‌ను రేవంత్ రెడ్డి ఖరారు చేశారట. త్వరలోనే ఆయన్ను అధికారికంగా తెలంగాణ కొత్త డీజీపీగా నియమించనున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్‌కు చెందిన జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ క్యాడర్‌కు వచ్చారు. మొదట ఆయన నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెల్లంపల్లికి వెళ్లి ఎస్పీగ పని చేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి సీబీఐలో పని చేశారు. 2004-2006లో గ్రేహౌండ్స్ లో పని చేసిన ఆయన డీఐజీగా ప్రమోట్ అయ్యారు. ఆ సమయంలో విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగానూ జితేందర్ పని చేశారు. అలాగే ఏపీలో  సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సుమెంట్‌లో కూడా జితేందర్ వర్క్ చేశారు.

ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్యకార్యదర్శగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఆయన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయన పదవీకాలం 2025 సెప్టెంబర్ వరకు ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ డీజీపీగా జితేందర్ నియమితులయితే.. 14 నెలల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక రేపో.. మాపో ఆయన్ను తెలంగాణ కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE