ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొన్నారు.ఉత్తరాంధ్ర తొలి పర్యటనలోనే ఆ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‌లో పెట్టాను. అధికారులను కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‌లో ఉంచాలన్నారు. తనను సంతోష పరచడం కోసం కాదని ప్రజలకు మేలు చేసేలా అధికారులంతా పని చేయాలని అన్నారు. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని బాబు వివరించారు. రెడ్ కార్పెట్లు వద్దని సూచించిన చంద్రబాబు.. ప్రభుత్వం ఇకపై పరుగులు పెడుతుందని.. అధికారులు కూడా ఆ స్పీడుకు సిద్దం కావాలని చెప్పారు.
విశాఖలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ఏపీ ముఖ్యమంత్రి ఆరోపించారు. బలవంతంగా భూములు తీసుకున్న వారి నుంచి మళ్లీ ఆ భూములను వెనక్కి ఇప్పించాలని బాబు ఆదేశించారు. భూ కబ్జాలు చేసేవారిపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రైల్వే జోన్‌కు అవసరమైన భూములు ఇవ్వలేదనే వివాదం ఉందని.. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన స్థలాన్ని ఇచ్చి రైల్వే జోన్ పనులు పూర్తి చేయాలని సీఎం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ 2026 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో 500 ఎకరాలు కూడా ఇచ్చి ఎయిర్ పోర్టును అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్ అనేవి ఎక్కడా కనిపించకూడదని.. దాని నివారణ కోసం పోలీసులు ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సింహాచలం భూముల్లో చాలా మంది ఇళ్లు కట్టుకున్నారన్న సీఎం చంద్రబాబు..వాటన్నిటినీ పరిశీలించి వాళ్లకు అనుమతులు ఇవ్వమని అధికారులకు చెప్పారు. ఇలాంటి ప్రాంతాలలో కాస్త హ్యూమన్ యాంగిల్‌తో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టులన్నీ మూలనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో వీది కుళాయిలో నీళ్లు పట్టుకుని అలాగే తాగేంత స్వచ్ఛమైన శుద్ధి చేసిన మంచి నీటి సరఫరా జరగాలని ఆధికారులకు చంద్రబాబు ఆదేశించారు. నేషనల్ హైవేకు కూడా ఎయిర్ పోర్టుతో కనెక్టివిటీని పెంచాలని సీఎం చెప్పారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకూ.. వయా భీమిలి మీదుగా బీచ్ కారిడార్ డెవలప్ చేయాలని అధికారులకు తెలిపారు. రానున్న రోజుల్లో వీటన్నిటి పనులను చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని బాబు సూచించారు. మెడ్ టెక్ జోన్ నెక్స్ట్ ఫేజ్ కోసం కూడా ఓ ప్రణాళిక సిద్దం చేయాలని కోరారు. బీచ్ రోడ్‌ను మూలపేట వరకు విస్తరించాలని అన్నారు . అంతేకాదు..విశాఖలో అప్పుడు ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE