
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని ఓ అద్భుతమైన ఖజానాగా చెబుతారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కిందట జగన్నాథుని వెలకట్టలేని ఎంతో విలువైన ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి,ఓ రహస్య గదిలో భద్రపరిచారు. అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి ఆభరణాలను లెక్కించేవారు అయితే 1978 తర్వాత ఆ గదిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. చివరకు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశం మొన్నటి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిపోయింది. చివరకు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో.. పూరీ జగన్నాథ ఆలయంలోని ఖజానాను తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు 46 ఏళ్ల తర్వాత రేపు అంటే జులై 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాలను లెక్కించడంతో పాటు అవసరమైన రిపేర్లు కూడా చేయనున్నారు. ఒడిస్సా ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ ఈ భాండాగారాన్ని తెరవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. జులై 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ.. కమిటీలోని 16 మంది సభ్యులు దీనిపై తీర్మానం చేశారు. ఆలయంలోని భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల సేఫ్టీపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ.
భాండాగారం తాళం విషయంలో ఉన్న వివాదంపై కూడా జస్టిస్ బిశ్వనాత్ రథ్ కమిటీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ భాండాగారం డూప్లికేట్ కీ కలెక్టరేట్‌లోని ట్రెజరీలో భద్రంగా ఉందని ఒకవేళ ఆ తాళంతో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలుపులు తెరుస్తామని కమిటీ చెప్పింది. లేటెస్ట్ టెక్నాలజీతో ఆభరణాలను, సంపదను లెక్కపెట్టనున్నారు. అయితే ఈ లెక్కింపు ఎప్పటికి పూర్తి అవుతుందో ఇప్పుడమేమీ చెప్పలేమని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ చెబుతోంది. ఈ జ్యువెలరీ లెక్కింపు పూర్తి అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ, నియమ నిష్టలతో ఉంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ జగన్నాథుడి వజ్ర, వైఢూర్యాలు,స్వర్ణాభరణాలు, కెంపులు, గోమేధిక, పుష్యరాగాలు, రత్నాలు, వెండి ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం ఉంటుంది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు ఇప్పట్లో సాధ్యం కాదని..ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల మధ్య ఆ ఆభరణాల లెక్కింపు, నాణ్యతను పరిశీలిస్తారు. అంతేకాకుండా 46 ఏళ్లుగా మూతబడి ఉన్న రత్న భాండాగారం రిపేర్ల కోసం ఇప్పుడు మరో కమిటీ అవసరమని జస్టిస్ రథ్ కమిటీ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY