
గతంలో కేసీఆర్ ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోళ్ల అంశాలను పరిశీలిస్తున్న ఎలక్ట్రిసిటీ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్..అత్యున్నత ధర్మాసనమైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని..అత్యున్నత ధర్మాసనం ఈ రోజు అంటే జులై 15న విచారించనుంది. ఐతే.. ఇదే విషయంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. కమిషన్ వేయడం తప్పేమీ కాదనీ, విచారణ జరగనివ్వాలని హైకోర్టు చెప్పింది. దీంతో తనకు న్యాయం జరపాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. అయితే ఈ కమిషన్, మాజీ సీఎం కేసీఆర్‌ని తమ ముందుకొచ్చి విచారణలో పాల్గొనాల్సిందిగా కోరింది. కానీ అది ఏమాత్రం ఇష్టం లేని కేసీఆర్.. అసలు ఆ కమిషనే తప్పని అన్నారు. అంతేకాకుండా కమిషన్ జరుపుతున్న విచారణ కూడా సరైనది కాదని కేసీఆర్ చెప్పారు.దీనిపై జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుకోవాలని కోరుతూ ఓ లేఖ కూడా రాశారు.
మాజీ సీఎంకేసీఆర్ తీరుపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు. తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. ఏ తప్పూ చేయకపోతే ఈ విచారణను ఎదుర్కోవాలని ఛాలెంజ్ విసిరింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో న్యాయం జరగలేదంటూ అత్యున్నత ధర్మాసనాన్ని కేసీఆర్ ఆశ్రయించడంతో..ఈ పరిస్థితుల్లో నేడు విచారణకు రానున్న ఈ కేసు విచారణ ఎలా జరుగుతుందో, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందో అన్నది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY