భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి ఎవరిది పైచేయి ..?

Who Has the Upper Hand This Time in Bhadrachalam Constituency,Who Has the Upper Hand This Time,This Time in Bhadrachalam Constituency,Bhadrachalam Constituency,Mango News,Mango News Telugu,Bhadrachalam Constituency , Voters, Where Are the Voters of Bhadrachalam, Upper Hand in Bhadrachalam Constituency, Podem Veeraya, Brs Candidate, Tellam Veeraya,Bhadrachalam Constituency Latest News,Bhadrachalam Constituency Latest Updates,Bhadrachalam Constituency Live News
Bhadrachalam Constituency , voters, Where are the voters of Bhadrachalam? upper hand in Bhadrachalam constituency, Podem Veeraya, BRS candidate, Tellam Veeraya

భద్రాచలం నియోజకవర్గంలో ఈ సారి గెలుపెవరిది అనే విషయానికి వస్తే.. భద్రాచలం గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పొడెం వీరయ్య మూడోసార్లు అక్కడ విజయం సాధించారు .  మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వీరయ్యతో తలపడబోతున్నారు. గతంలో వీరయ్య ములుగు నియోజకవర్గంలో 1999, 2004లలో కాంగ్రెస్‌ ఐ పక్షాన గెలవగా,గత ఎన్నికల్లో భద్రాచలం నుంచి విజయం సాధించి బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం ములుగు సీటును  సీతక్కకు కేటాయించి.. వీరయ్యకు భద్రాచలం సీటు ఇవ్వగా ఇద్దరూ గెలిచారు. వీరయ్య తన సమీప గులాబీ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావుపై  11,785 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పొడెం వీరయ్యకు 47, 746 ఓట్లు రాగా, తెల్లం వెంకటరావుకు 35,961 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ సీపీఎం పక్షాన పోటీ చేసిన మాజీ ఎంపీ మిడియం బాబూరావుకు 12,400 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు భద్రాచలం సీపీఎం కంచుకోటగా ఉండేది. కాని రకరకాల పరిణామాలలో ఆ పార్టీ బలహీన పడిపోయింది. భద్రాచలంలో 2014లో సీపీఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓడిపోయినా, తిరిగి 2014లో తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మను 1815 ఓట్ల తేడాతో ఓడించారు. సున్నం రాజయ్య అంతకు ముందు రెండుసార్లు విజయం సాధించారు. 2014లో తెలంగాణలో సీపీఎం పక్షాన గెలిచిన ఏకైక నేతగా కూడా రాజయ్య పేరు గాంచారు. అయితే 2018లో రాజయ్య పోటీ చేయలేదు.

2009లో మిర్యాలగూడలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో  మాత్రం రంగారెడ్డి ఓడిపోయారు. విచిత్రంగా 2018లో సీపీఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండానే పోయింది. భద్రాచలంలో 2014లో అప్పటి కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కుంజా సత్యవతి  ఓటమి పాలయ్యారు.  1952వ సంవత్సరం, 1955 సంవత్సరం ఎన్నికల వరకు భద్రాచలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్లిపోయింది. భద్రాచలం 1952,1955లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది.

1952 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కేఎమ్‌పీపీ గెలిస్తే, 1955లో సీపీఐ గెలిచింది. అయితే లా  గెలిచిన వారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో.. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో పీవీ రావు గెలిచారు. ఈ బై ఎలక్షన్స్‌తో పాటు  మొత్తం నాలుగు సార్లు కాంగ్రెస్‌ గెలవగా.. సీపీఎం పార్టీ  ఎనిమిదిసార్లు గెలిచింది. ఇక్కడ తెలుగు దేశం పార్టీ ఒకసారి కూడా గెలవలేదు. సీపీఎం నేతలయిన కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచారు. సీపీఐ మాజీ ఎంపీ సోడే రామయ్య ఆ తర్వాత కాలంలో  తెలుగు దేశం పార్టీలో చేరి భద్రాచలంలో పోటీ చేసినా అక్కడి ఓటర్లు రామయ్యను ఓడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + three =