తెలంగాణలో బీఆర్ఎస్కు కంచుకోట మెదక్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందు నుంచి కూడ బీఆర్ఎస్దే హవా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో.. అక్కడ బీఆర్ఎస్కు మంచి పట్టు ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం తమ సత్తా చాటింది. కానీ ఒక్క మెదక్‌కి వచ్చే సరికి డీలా పడిపోయింది. బీఆర్ఎస్ కంచుకోటను బద్ధలు కొట్టలేకపోయింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా అక్కడ బీఆర్ఎస్ పై చేయి సాధించింది. ఉమ్మడి మెదక్‌లో మూడు స్థానాలు తప్పించి.. మిగిలిన అన్ని స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్‌పై కన్నేశారు. బీఆర్ఎస్ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. బీఆర్ఎస్ నేతలకు గాలం వేసి తమవైపు లాక్కుంటోంది. బీఆర్ఎస్ను ఖాళీ చేసి.. నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఒక ఎంపీని తమవైపు లాక్కుంది. మిగిలిన వారిని కూడా తమవైపు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడ మెదక్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కన్నేసింది. వారిని తమవైపు రప్పించుకుంటే బీఆర్ఎస్ బలహీనమయిపోతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, జహీరాబాద్, సిద్ధిపేట, దుబ్బాక, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాలను దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం నారాయణఖేడ్, ఆందోలు, మెదక్ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఇప్పుడు ఉమ్మడి మెదక్‌కు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. వారిలో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మెదక్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడే వారంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. కానీ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిశామని అప్పట్లో వారు చెప్పుకొచ్చారు. కానీ ఈసారి పక్కాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక జరిగితే బీఆర్ఎస్కు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి వారిని కాంగ్రెస్‌లోకి వెళ్లనివ్వకుండా కేసీఆర్ అడ్డు కట్ట వేస్తారా? లేదా? అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE