ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో.. వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. గత అయిదేళ్లు వైసీపీ ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోయిన నేతలంతా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక అయోమయంలో పడిపోయారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై ఉన్న కేసులను తవ్వుతోంది. కొందరిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసింది. మరికొంత మందిపై కూడా కేసులు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో కేసులు.. చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు.. అధికారపక్షంలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొంత మంది నేతలు తెలుగు దేశం పార్టీలోకి వెళ్తారని అంటున్నారు.
ఈక్రమంలో విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని వ్యూహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలోకి దిగిన అవినాష్.. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అవినాశ్ రెడ్డి టీడీపీ నేతలపై రెచ్చిపోయారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇష్టంవచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో లోకేష్ అడుగుపెట్టే ముందు లోకేష్ ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అవినాశ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా గతంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో కూడా అవినాశ్ కీలక పాత్ర పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అవినాశ్ పై కేసు నమోదు అయింది. ఇప్పటికే ముందుస్తు బెయిల్ కోరుతూ అవినాశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో కేసులు చిక్కుల నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ తెలుగు దేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. తన తండ్రి దేవినేని రాజశేఖర్‌కు అత్యంత సన్నిహితులయిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె బాబురావు వంటి నేతలతో అవినాశ్ చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే ఆ ఇద్దరు నేతలు అవినాశ్ చేరికపై హైకమాండ్‌తో కూడా మాట్లాడారట. అయితే గతంలో అవినాశ్ తీరు.. లోకేష్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా అవినాశ్‌ను చేర్చుకునేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యమంగా నారా లోకేష్.. అవినాశ్‌పై ఆగ్రహంతో ఉన్నారట. అందువల్ల అవినాశ్‌ను పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెబుతున్నారట. మరి చూడాలి చివరికి శాంతించి అవినాశ్‌ను పార్టీలో చేర్చుకుంటారా? లేదా? అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE