కర్ణాటకలో స్థానికులకే ఉద్యోగాలు అంటూ అక్కడి ప్రభుత్వం చేసిన 100 శాతం కోటా ప్రకటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో ‘సి, డి’ గ్రేడ్ల పోస్టుల్లో 100 శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లుకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని తన ప్రకటనలో పేర్కొన్నారు. కన్నడిగులు తమ రాష్ట్రంలో సుఖంగా జీవించేందుకు అవకాశం కల్పించాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాగా, స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ 2024ను కర్ణాటక కేబినెట్ ఆమోదించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నాస్కామ్ ప్రకటన చేసింది.
కర్ణాటక క్యాబినెట్ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించింది. అయితే బిల్లుపై పారిశ్రామిక వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దీనిపై విస్తృతంగా సంప్రదింపులు చేశాక బిల్లుపై పునరాలోచిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఈ బిల్లుకు సంబంధించి ఎక్కడ తాము వెనక్కి తగ్గినట్లు ప్రకటించలేదు ప్రభుత్వం. పైపెచ్చు కర్ణాటకలో ఉన్న అన్ని సంఘాలను సంప్రదించాకే ఈ బిల్లుపై ముందడుగు వేశామని చెప్పుకొస్తోంది. వాస్తవానికి అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ బిల్లుపై కసరత్తు చేసినప్పటికి ముందడుగు పడలేదు.
స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే రిజర్వేషన్లు తీసుకురావడం ఏ రకమైన ప్రభావం చూపునుందనే ఆందోళన ఇప్పుడు అంతటా నెలకొని ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ఇవ్వడం చాలా సులభం. గవర్నమెంట్ కొలువులు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇక ప్రైవేటు సెక్టార్ కు వచ్చేసరికి ప్రపంచంలోనే పోటీ ఉన్న కంపెనీలను తట్టుకుని నిలబడగలిగాల్సి ఉంటుంది. బెంగళూరులో ఉన్న సాప్ట్ వేర్ కంపెనీలు పోటీని తట్టుకుని సాప్ట్ వేర్ ను ఎగుమతి చేయాలంటే నైపుణ్యం ఉన్న ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రాంతాలకు అతీతంగా నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ స్థానిక రిజర్వేషన్ ప్రకారం ఐటీ కంపెనీలను కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన పెడితే కంపెనీలు అక్కడి నుంచి తరలిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతే కాదు ఈ రిజర్వేషన్ ప్రకారం కర్ణాటకలో కంపెనీ ఉన్నప్పటికి అక్కడ స్థానికులకు అరకొర ఉద్యోగాలు ఇచ్చి. ఆయా కంపెనీలు సబ్ కాంట్రాక్టు ఇచ్చి ఇతర ప్రాంతాల్లోని నైపుణ్యమున్న ఉద్యోగులను పెట్టుకునే అవకాశముంది. స్థానికుల్లో అవసరమైన మేరకు స్కిల్ ను అభివృద్ది చేసి వారికి ప్రయోజనాలు ఇవ్వాల్సిందే.. అదే సమయంలో ఇతర ప్రాంతాల వారికి అవకాశమిస్తేనే పురోగతి ఉంటుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY