ఒలంపిక్స్ కోసం ఇన్ని కోట్ల ఖర్చా?

Paris Olympics From July 26,Paris Olympics, Olympics From July 26,Olympic Schedule & Results - 26 July,Olympic Schedule,Olympic Games Paris 2024,Olympic Games Paris 2024,Paris 2024,2024 Summer Olympics, Schedules & Results,Paris Olympic Games 2024,Olympic Games 2024,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu
Paris Olympics 2024,Olympics 2024,Paris Olympics from July 26,

పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో  భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనడానికి  రెడీ అవుతున్నారు. గతంలో టోక్యో ఒలింపిక్స్‌ జరిగినపుడు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలను సాధించింది. ఇదే ఊపుతో ఈసారి మరోసారి భారత జట్టు పతకాలను పెంచుకోవాలని భావిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం మోడీ ప్రభుత్వం మొత్తం  417 కోట్ల రూపాయలు వెచ్చించింది. పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ నుంచి అత్యధికంగా 29 మంది ఆటగాళ్లను భారతదేశం కలిగి ఉంది. భారత ప్రభుత్వం అథ్లెటిక్స్ కోసం ఏమాత్రం వెనుకాడకుండా రూ.96.08 కోట్లు ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అథ్లెటిక్స్‌లో ఇండియా కేవలం 3 పతకాలు మాత్రమే సాధించింది. గత ఎడిషన్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో గోల్డ్ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.

ఇక భారత ప్రభుత్వం బ్యాడ్మింటన్ కోసం 72.02 కోట్లు ఖర్చు చేసింది.  ఈసారి బ్యాడ్మింటన్‌లో మొత్తం 7 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ గేమ్‌ లో భారత్ మొత్తం 3 పతకాలను సాధించింది. పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని,2016 రియో ​​ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించింది. దీనికి ముందు సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్ 2012లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని సాధించి రికార్డ్ సృష్టించింది.

ఇక బాక్సింగ్‌లో 60.93 కోట్లు రూపాయలు, షూటింగ్‌లో రూ.60.42 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్ చరిత్రలో బాక్సింగ్‌ లో భారతదేశం మొత్తం 3 పతకాలను సాధించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ , 2020లో లోవ్లినా బోర్గోహైన్ ముగ్గురూ 3 కాంస్య పతకాలు సాధించారు. అలాగే షూటింగ్‌లో భారత్ మొత్తం 4 పతకాలు సాధించింది. దీనిలో అభినవ్ బింద్రా స్వర్ణం కూడా ఉంది.

ఇకపోతే హాకీకి 41.29 కోట్లు రూపాయలు, ఆర్చరీకి 39.18 కోట్లు రూపాయలు, రెజ్లింగ్‌కు 37.80 కోట్లు మస్తాన్ వలీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో భారత్ హాకీలో మొత్తం 12 పతకాలు సాధించగా..దీనిలో 8 బంగారు పతకాలు ఉండడం గమనార్హం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారత్ ఇప్పటివరకు ఆర్చరీలో ఒక్క పతకాన్ని కూడా సాధించలేకపోయింది. ఈసారి 6 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొనడం ద్వారా చరిత్రను మార్చాలనుకుంటున్నారు. రెజ్లింగ్‌లో భారత్‌కు 2 రజతాలు సహా మొత్తం 7 పతకాలు వచ్చాయి.

అలాగే వెయిట్ లిఫ్టింగ్ కోసం రూ.26.98 కోట్లు ఖర్చు చేశారు. ఒలింపిక్స్‌లో ఈ వెయిట్ లిఫ్టింగ్‌లో భారతీయులు మొత్తం 2 పతకాలు సాధించారు. 2000లో కరణం మల్లీశ్వరి కాంస్యం, 2020లో మీరాబాయి చాను రజతం గెలుచుకున్నారు. దీంతో పాటు టేబుల్ టెన్నిస్‌పై 12.92 కోట్లు రూపాయలు, జూడోపై 6.30 కోట్లు రూపాయుల, స్విమ్మింగ్‌ పై 3.90 కోట్లు రూపాయలు, రోయింగ్‌ పై 3.89 కోట్లు రూపాయలు, సెయిలింగ్‌ పై 3.78 కోట్లు రూపాయలు, గోల్ఫ్‌ పై 1.74 కోట్లు రూపాయలు, టెన్నిస్‌ పై 1.67 కోట్లు రూపాయలు, గుర్రపు స్వారీపై 0.95 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY