పయ్యావుల కేశవ్.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత. మూడు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు మంత్రి అవ్వాలనే పయ్యావుల కోరిక నెరవేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొంది అధికారంలోకి రావడంతో.. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో పయ్యావులకు చోటు దక్కింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత కీలకమైన స్థానం పయ్యావులకు దక్కింది. ఆర్థిక, శాసనసభా వ్యవహారాలను పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే పయ్యావుల కోరిక మాత్రం కోరికగానే మిగిలిపోతుందా? తీరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ ప్రవేశ పెట్టడం కోసం పయ్యావుల ఇంకా ఎన్నిరోజులు వేచి చూడాలనేది చర్చనీయాంశమయింది.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో 29 ఏళ్ల వయస్సులోనే పయ్యావుల కేశవ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో పయ్యావుల కేశవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994 నుంచి 2004 వరకు వరుసగా ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. అయిదుసార్లు గెలుపొందారు. అయితే ఇన్నేళ్లు మంత్రి అవ్వాలనే ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు టీడీపీ అధికారంలో లేకపోవడం.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో ఇన్నేళ్లు ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షలానే ఉండిపోయింది. కానీ 2024లో టీడీపీ కూటమి గెలుపొందడం.. అటు పయ్యావుల కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన్ను ఎట్టకేలకు మంత్రి పదవి వరించింది.
అయితే తొలిసారి ఆర్థిక మంత్రి అయిన పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేకపోయారు. అసెంబ్లీలో బడ్జెట్‌ని ప్రవేశ పెట్టడం.. కీలకమైన ప్రసంగం ఇవ్వడం అనేది గొప్ప అవకాశం. అయితే ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకుండానే సెషన్ ముగిసింది. త్వరలోనే ఓటాన్ అకౌంట్‌ని తీసుకొస్తూ ఆర్డినెన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎన్ని నెలలకు ప్రవేశ పెడుతారో చూసుకొని.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. లేదంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతారు. అప్పటి వరకు పయ్యావుల వేచి చూడాల్సిందే. దీంతో ఆర్థిక మంత్రి అయినప్పటికీ.. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే పయ్యావుల కోరిక ఎప్పటికి తీరుతుందనేది చర్చనీయాంశమయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE