రాజకీయానికి తెర లేపిన రాజకీయ పార్టీలు

Two Candidates With Same Name, Chevella, Chevella MP Seat, Two Candidates, Candidates With Same Name, Political Parties, Politics, Ranjith Reddy, BRS Candidate Kasani Gnaneshwar, Konda Vishweshwar Reddy, Congress, BJP, BRS, Telangana, TS Live Updates, Mango News, Mango News Telugu
Two candidates,Political parties, politics,Ranjith Reddy, BRS candidate Kasani Gnaneshwar, Konda Vishweshwar Reddy, Congress, BJP, BRS

తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసిపోవడంతో.. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది నామినేషన్ దాఖలు చేశారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలలో పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో.. రానున్న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై సర్వత్రా చర్చనీయాంశం అయింది.

మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు.. ఒకే పేరుతో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనే అభ్యర్థి చేవెళ్ల నియోజకవర్గంలోనే నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాంటి కల్చర్ ఈ మధ్య పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే చాలా చోట్ల అభ్యర్ధి పేరును పోలిన పేరు ఉంటుంది కానీ ఇంటి పేరు మరోలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అభ్యర్థుల పేరుతో పాటు ఇంటి పేరు ఒకేలా ఉండటంతో ఇది ఫలితాలను ఏ విధంగా తారుమారు చేయబోతుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల సంహరణ చేసుకోవడానికి అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి..ఇప్పుడు నామినేషన్ వేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకుంటారా లేక పోటీలోనే ఉంటారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

చేవెళ్ల నియోజకవర్గాన్ని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి నిలబడ్డ చోట్ల స్వతంత్ర అభ్యర్దులుగా అదే పేరుతో చాలామంది నిలబడటం కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణంగా మారిందన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nineteen =