నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు.. తమ ప్రభుత్వంలో దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైన వాటికి తమ ప్రభుత్వంలో తావే లేకుండా చూసుకుంటున్నారు. వీలైనంత ఎక్కువగా జనాలకి దగ్గరగా ఉండేలా చూసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా జనాల్లోకి వెళ్లి.. వారిని కలుస్తున్నారు. ఇటీవల పెన్షన్ పెంపులో భాగంగా.. జులై 1న నేరుగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు నాయుడు పెన్షన్ అందించారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా జనాల్లోకి వచ్చింది లేదు. పరదాల ముఖ్యమంత్రిగా ఆయన పేరు గడించారు. చివరికి ఏపీలో అధికారాన్నే కోల్పోయారు. తెలంగాణలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండి అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ తప్ప చేయొద్దని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వీలైనంత ఎక్కువగా జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. 2029లో కూడా గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. జగన్ మాదిరిగా.. జనాల్లో వ్యతిరేకత రాకుండా ఇప్పటి నుంచే చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఈక్రమంలో మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.
జులై 1న జనాల వద్దకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేసినట్లుగానే.. వచ్చే నెల 1వ తారీఖున కూడా జనాల వద్దకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారట. స్వయంగా తన చేతుల మీదుగా వృద్ధులకు పెన్షన్ అందివ్వనున్నారట. మడకశిర నియోజకవర్గంలోని గుండుమల గ్రామంలో ఆగష్టు 1న వృద్ధులకు చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాబు వెంట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉండనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE