ఏపీలో కొద్దిరోజులుగా వాలంటీర్ల వ్యవహారం కాక రేపుతోంది. అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు లక్షల అరవై వేల మంది వరకు వాలంటీర్లు ఉన్నారు. కానీ ఎన్నికలయిపోయాక వాలంటీర్ వ్యవస్థను తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో కొందరు రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ నేతల ఒత్తిళ్లతో కూడా రాజీనామా చేశారని ఆరోపణలు ఉన్నారు. మొత్తానికి రాజీనామా చేసిన వారు పోగా.. లక్ష మంది వాలంటీర్లు మిగిలారు. ఎన్నికల వేళ టీడీపీ కూటమి కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా వారి జీతాన్ని కూడా డబుల్ చేసి.. నెలకు రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వాలంటీర్ల ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. జులై 1న పెన్షన్ల పంపిణీ అప్పుడు కూడా వాలంటీర్లను పక్కకు పెట్టి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను వాడుకుంది. మరో రెండు రోజుల్లో మరోసారి పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఈసారి కూడా వాలంటీర్లు కాకుండా.. సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లే ఇంటింటికి తిరిగి పెన్షన్లను పంపిణీ చేసేవారు. కానీ ఇప్పటి వరకు కూడా వాలంటీర్లను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. వారి పట్ల ఏ రకమైన నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారికి జీతాలు ఇవ్వలేదని తెలుస్తోంది.
ఈక్రమంలో వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా? లేదా తొలగిస్తారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు సచివాలయ ఉద్యోగులకే చేతినిండా పని లేదట. ఇంకా వాలంటీర్లతో ప్రభుత్వానికి అసలే పని లేదట. ఏమైనా పని ఉన్నా కూడా.. దానిని సచివాలయ ఉద్యోగులతోనే చేయించుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయట. ఇప్పుడు వాలంటీర్లను కొనసాగించి.. వారి జీతాలను పది వేలకు పెంచితే ప్రభుత్వంపై అదనపు భారం పడడం తప్పించి.. లాభం ఉండదని ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నాయట. అయితే వారిని సక్రమంగా ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోందట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో…
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE