ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం

Andhra Governor Biswa Bhusan Harichandan to take charge, Biswabhusan Harichandan Take Oath As AP New Governor, Harichandan takes oath as Andhra Pradesh Governor, Mango News, New AP Governor Biswa Bhusan Harichandan, New AP governor Harichandan to take oath on Jul 24, New Governor to take oath today, Senior BJP leader Biswa Bhusan Harichandan Oath As AP New Governor

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11:30 నిమిషాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయనాయకులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆయనను ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమించారు.

బిశ్వభూషణ్ హరిచందన్ కు భారతీయ జనతా పార్టీతో దీర్ఘకాలంగా అనుంబంధం ఉంది, 1980లో ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు గా పార్టీకి సేవలు అందించారు, గతంలో బీజేపీ-బీజేడీ ప్రభుత్వంలో మంత్రిగా కూడ పని చేసారు. మంగళవారం నాడు సాయంత్రమే బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడకు చేరుకున్నారు, గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఘన స్వాగతం తెలిపారు, అనంతరం రాజ్ భవన్ చేరుకొని సాయుధ దళాల గౌరవ వందనం అందుకున్నారు. ఛీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు, ఇతర అధికారులు కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు స్వాగతం చెప్పి, అభినందనలు తెలియజేసారు.

 

[subscribe]
[youtube_video videoid=ym62APILBdQ]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =