తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు పడ్డాయా అంటే.. పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసాక మరింత స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్‌ను లూటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేస్తోంది. ఇప్పట వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గలానికి చిక్కారు. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్‌న వీడి కాంగ్రెస్ గూటికి చేరిన ఓ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నాడు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.
అవును.. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2009లో టీడీపీ తరుపున గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) పార్టీలోకి జంప్ అయ్యారు. మరోసారి బీఆర్ఎస్ తరుపున 2014 సార్వత్రిక ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసి మళ్లీ డీకే అరుణ చేతిలోనే రెండోసారి ఓడపోయారు. ఆ తర్వాత 2017లో బీఆర్ఎస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరుపున గద్వాల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను ఓడించారు. ఈసారి 51,687 ఓట్ల మెజార్టీతో గెలుపొదారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు.
కానీ ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కృష్ణ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని నెల రోజులు కూడా కాకముందే తిరిగి.. బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని నెలరోజులు కూడా కాకముందే తిరిగి సొంత గూటికి వెళ్లడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం అధికార కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అని.. బీఆర్ఎస్‌క ఊరట కలగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా యూటర్న్ తీసుకుంటారా అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY