పనిచేసిన కూలీలకు డబ్బులివ్వండి, కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ

Minister Errabelli Dayakar Rao Writes Letter Centre Over Release Of 110 Cr Under MGNREGS Scheme,Give Money To Laborers, Minister Errabelli Dayakar Rao Letter To Centre,MGNREGS Scheme,Dayakar Rao Writes Letter Centre,Centre Over Release Of 110 Cr,Release Of 110 Cr Under MGNREGS Scheme,Mango News,Mango News Telugu,MGNREGS,Mahatma Gandhi National Rural Employment Guarantee Act,Mahatma Gandhi Nrega,Mahatma Gandhi National Rural Employment,MGNREGS Scheme News And Updates,Mgnrega

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి ఇక్కడి పేద ప్రజల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకుండా కేంద్ర సర్కార్ తెలంగాణ ప్రజల గోస తీస్తోందన్నారు. దీనిపై ఆవేదన చెందుతూ, కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు గత రెండు నెలల పనుల నిమిత్తం 110.35 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. కానీ పేద ప్రజలు చేసిన పని వేతనం కూడా కేంద్రం రెండు నెలల నుంచి ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఈ 110.35 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మంత్రి ఎర్రబెల్లి తన లేఖలో కేంద్రమంత్రిని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =