ఇటీవల కాలంలో బలవంతపు మతమార్పిడులు ఎక్కువై పోయిన విషయం తెలిసిందే. ప్రేమ, పెళ్లి పేరుతో కొందరు యువతులకు వల వేసి బలవంతంగా మత మార్పిడి చేయిస్తున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోయాయి. మతమార్పిడి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొని కొందరు యువతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో బలవంతపు మతమార్పిడిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కొందరు కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్నారు. బలవంతపు మతమార్పిడిలను ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకోవాలని.. ఎవరైనా ప్రేమ పేరుతో వేధించి మతమార్పిడి చేయిస్తే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ తాము మరోసారి అధికారంలోకి వస్తే బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించింది.
ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. బలవంతపు మతమార్పిడుల నిరోధక బిల్లు-2024ను సోమవారం ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టగా.. మంగళవారం దానికి ఆమోదం లభించింది. అయితే అదే రోజు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా ఈ బిల్లును యూపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. విపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. నాటకీయ పరిణామాల మధ్య ఒక్కరోజులోనే ఆ బిల్లుకు ఆమోదం లభించింది. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగినప్పటికీ.. వారిని సభ నుంచి బయటకు పంపించి బిల్లును ఆమోదించుకున్నారు. ఈక్రమంలో బలవంతపు మతమార్పిడుల నిరోధక బిల్లు-2024ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది.
ఈ చట్టం బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని నిరోధిస్తుంది. చిన్న వయస్సులోనే యువతులను బలవంతంగా పెళ్లి చేసుకోవడం.. వారిని బలవంతంగా మత మార్పిడి చేయడం వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. అలాగే ఇతర మతాల్లోకి హిందువులను బలవంతంగా మత మార్పిడి చేసే సంస్థలు, వ్యక్తులను ఈ చట్టం నిరోధించడంతో పాటు.. వారికి యావజ్జీవ జైలు శిక్ష పడేలా చట్టంలో సవరణలు చేశారు. ఇకపై వివాహం చేసుకుంటానని నమ్మించి వారిని లైంగికంగా వేధించినా కూడా అది నేరమే అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF