బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడిన మటను పిచ్చి మాటలుగా వర్ణించిన కంగనా… రాహుల్‌గాంధీకి డ్రగ్ టెస్ట్ చేయించాలని సంచలన కామెంట్స్ చేశారు. న్యూస్ సోర్స్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కంగనా కామెంట్స్ పై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్లమెంటులో రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇది సభ లోపలా, బయటా తీవ్ర చర్చకు దారితీసింది, భారత సంకీర్ణంలోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సహా ప్రతిపక్ష నాయకులు దీనికి మద్దతునిచ్చారు, అయితే అధికార బీజేపీ మాత్రమే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాజాగా రాహుల్ గాంధీ మాటలపై స్పందించిన కంగనా ఆయనపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తన మాటలతో రాజ్యాంగాన్ని బెదిరిస్తున్నారని అన్నారు. దేవుళ్ల ఫొటోలను ప్రదర్శించడం దేవుని ప్రస్తావన తీసుకువచ్చిన రాహుల్ కచ్చితంగా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి అని అన్నారు. వాస్తవానికి తాను కొత్త ఎంపీనని… అయితే ఇదంతా చూసి షాక్ అయ్యానని చెప్పారు.
ఈ దేశంలో జాతి, వర్ణం ఆధారంగా ప్రధానిని ఎంపిక చేయడం సాధ్యమేనా? అని అన్నారు. రేపు ప్రధాని రంగు చూడాలని అన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు. నిన్న కూడా పార్లమెంటులో కామెడీ షో చేశాడు. ఆయన మాటల్లో గౌరవం లేదని ఆరోపించారు. గతంలో కూడా రాహుల్ గాంధీపై కంగనా విరుచుకుపడింది. అతను మంచి స్టాండప్ కమెడియన్. బాగా నటిస్తాడనిచమత్కరించారు. కంగనా కామెంట్స్ పై సోషల్ మీడియాలో మిత్రమ స్పందన వస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ