తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, స్వామివారికి ప్రత్యేక పూజలు

Team India Star Batsman Suryakumar Yadav Visits Tirumala Temple Today Offers Special Poojas,Team India Star Batsman,Suryakumar Yadav Visits Tirumala,Tirumala Temple Today,Tirumala Special Poojas,Mango News,Mango News Telugu,TTD Latest News and Updates,Senior Citizens,Challenged Persons Tickets,DecemberQuota, Tirumala,Tirupati,Tirumala Tirupathi Devasthanam,TTD Latest News And Live Updates,December Quota TTD, TTD

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే తొలి రెండు టెస్టులను గెలుచుకున్న భారత్ త్వరలో ఇండోర్‌లో 3వ టెస్టు ఆడనుంది. ఈ క్రమంలో మొదటి టెస్టు మాదిరిగానే రెండో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగియడంతో విరామం ఎక్కువ రోజులు దొరికినట్లయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు వ్యక్తిగత పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో సమయం వెచ్చిస్తుండగా.. మరికొందరు ఆటగాళ్లు ఇతర పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇదేక్రమంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశాడు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన సూర్యకుమార్, నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నాడు. ఇక దర్శనానంతరం సూర్యకుమార్ రంగనాయకుల మండపంలో వేదపండితుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నాడు. అలాగే అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే నాగ్‌పూర్‌లో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మొదటి మ్యాచ్ ద్వారా టెస్టులలో అరంగేట్రం చేయడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =