బ్రష్ ఎలా చేయాలో తెలుసా?.. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లూ తెలుసుకోవాల్సిందే

Do You Know How To Brush,How To Brush,Adults,Brushing Your Teeth,Brush Your Teeth Properly, Children, Teeth, Tooth Protect, Tooth Paste,Steps to Brushing Your Teeth,Do You Know How to Brush,Steps To Brush Your Teeth,Live Updates, Politics, Political News,Mango News,Mango News Telugu,
Do you know how to brush?,children, adults,teeth,Tooth protect, toothpaste

చాలా మంది మీడియం లేదా హార్డ్ గా ఉండే బ్రష్ తో  పళ్లు తోముకుంటే దంతాలు మరింత బలంగా ఉంటాయని అనుకుంటారు. ఇలాగే బ్రష్ చేసేటప్పుడు వారికి తెలీకుండానే తప్పులు చేస్తారు. దీని వల్ల దంతాలకి ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉంది. అదే విధంగా చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడానికి భయపడతారు. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే డెంటిస్ట్ దగ్గరకి వెళ్లరు. అటువంటి వాళ్లు తప్పకుండా డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయాలి.

మంచి టూత్ పేస్ట్ ని ఉపయోగించేటప్పుడు  దంతాలని ప్రొటెక్ట్ చేస్తాయి. టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉంటే అది పళ్లు పుచ్చి పోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. చెడు వాసన కూడా  తొలగిస్తుంది. బ్రష్ చేసేటపుడు అడ్డదిడ్డంగా చేయకుండా పైకి కిందకి అలా ఒక ఆర్డర్లో చేస్తే పళ్లు డ్యామేజ్ అవ్వవు.

అలానే బ్రష్ చేసేటప్పుడు జాగ్రత్తగా తోమడం మంచిది. లేదంటే  దంతాల నుంచి రక్తం కారడం మొదలు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కనీసం రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా రోజుకి 3 నుంచి 4 సార్లు బ్రష్ చేయడం కూడా మంచిది కాదు. బ్రష్ ను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బ్రష్ ను హాట్ వాటర్ లో పెడితే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే దంత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE