ఈ చిట్కాలతో గ్యాస్ ప్రాబ్లెమ్స్ దూరం

These Tips Will Keep Gas Problems At Bay, Tips For Gas Problems, Gas Problems Tips, Natural Tips For Gas Problems, These Tips Will Keep Gas Problems, Check For Gas Problem, Gas Problem, Gas Problem Check, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

టీనేజ్ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ.. ఇప్పుడు అందరూ గ్యాస్ ప్రాబ్లెమ్ తోనే ఇబ్బంది పడుతున్నారు. మారిన ఆహారపుటలవాట్లు, టెన్షన్స్, నిద్ర పట్టకపోవడం వంటి కారణాలతో గ్యాస్ సమస్య బారిన పడుతున్నారు. అయితే దీని నుంచి బయట పడటానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి..
అల్లంతో..
అల్లం గ్యాస్ సమస్యను నివారించటమే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి సహాయపడుతుంది. అల్లంను జింజర్ టీ రూపంలో తీసుకోవచ్చు. లేదా అల్లం రసంగా చేసుకొని కూడా తీసుకోవచ్చు.
దాల్చినచెక్కతో..
దాల్చిన చెక్కలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడతాయి. దీని వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది. దాల్చిన చెక్క పొడిని కాఫీ లేదా సలాడ్స్ లో చల్లుకుంటే సరిపోతుంది.
అనాసతో..
అనాస లో బ్రొమైలిన్ అనే ఎంజైమ్ ఉండటం వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుతుంది. దీని వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.
మంచి నీటితో..
మంచి నీళ్లను ఎక్కువగా తాగటం వలన శరీరంలో మలినాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాక ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది. అందువలన మంచి నీటిని ఎక్కువగా తాగటం అలవాటు చేసుకోవాలి.
నట్స్ తో..
నట్స్ లో నియాసిన్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను యాక్టివ్ గా ఉంచుతుంది. దాంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది.
నిమ్మరసంతో..
నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల ప్రతి రోజు పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ఫలితాలు పొందొచ్చు.

వీటితో పాటు టైమ్ కు నిద్రపోవడం, స్పైసీ ఫుడ్స్ తినకపోవడం, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోవాలి. అయితే ఇంటి చిట్కాలు వాడినా గ్యాస్ సమస్య తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.