ఇకపై అబద్ధాలు చెప్పేవారిని ఇలా ఈజీగా పట్టుకోవచ్చట..

From Now on Liars Can be Easily Caught Like This,Liars Can be Easily Caught,Liars Can be Easily Caught Like This,From Now on Liars Can be Caught,Mango News,Mango News Telugu,the lies,If you lie, you will be caught,Thermographer,If you are telling lies,Someone is lying to you,Temperature,nerve endings,An element called the insula,Nose Temperature,Liars Can be Caught,Liars Can be Caught News Today,Liars Can be Caught Latest News

చాలామంది చాలా విషయాల్లో అబద్ధాలు (the lies) చెబుతూ ఉంటారు. కొంతమంది అవసరం మేరకు అబద్ధాలు చెబితే మరి కొందరు అవతలివాళ్లను ఏమార్చడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. దీని వల్ల కొంతమంది మోసపోతూ ఉంటారు. తర్వాత వాళ్లు తనకు అబద్ధం చెప్పారని తెలిసి బాధపడతారు. మరికొంతమంది అయితే ఏదైనా తప్పు చేసినప్పుడు.. అవతలి వారి నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పి సైడయిపోతారు. ఇంకొంతమంది ఏదైనా పరిస్థితులకు తగ్గట్లు చిన్న చిన్న అబద్ధాలు చెబుతూ ఉంటారు.

కొన్నిసార్లు బాధపెట్టే అబద్ధం చెప్పడం కంటే.. ఆనందపడే అబద్ధం చెప్పొచ్చని పెద్దలు కూడా చెబుతారు. అంతేకాదు ఒక్కొక్కసారి కొన్ని పనులు చేయించుకోవడానికి కూడా ఏదైనా అబద్దం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది.చాలామంది అబద్ధం ఆడినప్పుడు అవతలి వారు నమ్మేలా ఉంటాయి. మరికొంతమంది అయితే అబద్ధాలు ఆడుతూ దొరికిపోతుంటారు. అయితే ఇప్పుడు ఎవరు ఏ అవసరం కోసం అబద్ధం ఆడినా.. అవతలి వాళ్లను బుట్టలో పడేయటానికి అబద్ధం ఆడినా దొరికిపోవాల్సిందే (If you lie, you will be caught) అంటున్నారు సైంటిస్టులు. అవును ఇకపై అబద్ధాలు చెప్పేవారంతా జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు.

తాజాగా సైంటిస్టులు బయటపెట్టిన నివేదిక ప్రకారం.. ఇకపై అబద్ధాలు చెప్పేవారిని థర్మోగ్రాఫర్ (Thermographer) సాయంతో సులువుగా పట్టుకోవచ్చట. దీని కోసం సింపుల్‌గా అవతలి వారి ముక్కును (Nose) పట్టుకుంటే సరిపోతుందట. ఎవరైనా అబద్ధాలు చెబుతుంటే (If you are telling lies).. వారి శరీరంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయనే దానిపై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. దీని ప్రకారం ఎదుట వ్యక్తి అబద్ధాలు చెప్పేటప్పుడు అతని ముక్కు చుట్టూ, కంటి లోపల కండరాల్లో ఉష్ణోగ్రతలు (Temperature )పెరుగుతున్నట్లు.. థర్మోగ్రాఫర్ సాయంతో గుర్తించవచ్చట.

సాధారణంగా మనిషి అబద్ధం చెప్పినప్పుడు అతని మెదడులో ఇన్సులా అనే మూలకం (An element called the insula) విడుదల అవుతుందట. దీని వల్ల ముక్కు చుట్టూ కూడా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయట. అందుకే ఇబ్బందిగా ఫీలయ్యి.. ముక్కు దగ్గర దురద వచ్చి గోకడం వంటివి చేస్తారట. లేదంటే పదే పదే చేతితో ముక్కును టచ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారట. అంతేకాదు ఎవరైనా అబద్ధాలు చెప్పేటప్పుడు ముక్కు లోపల నరాల చివరలు (nerve endings) జలదరిస్తున్నట్లు అవుతాయట. దీంతోపాటు కణజాలం ఉబ్బుతుండటం వంటివి కూడా జరుగుతాయి.

అందుకే అబద్ధాలు చెప్పేవారిని గుర్తు పట్టడానికి.. కేవలం వారి ముక్కును పట్టుకుంటే సరిపోతుందని సైంటిస్టులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అంతేకాదు అబద్ధాలు చెప్పేవారు కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడలేరు . అలాగే నిలకడగా నిలబడకుండా.. అటూ, ఇటూ కదులుతూనే ఉంటారు. దీంతోపాటు అబద్దం చెప్పేటప్పుడు (When lying) చాలా అంటే చాలా తక్కువ పదాలు మాత్రమే మాట్లాడతారని.. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే ఎక్కడ దొరికిపోతామోనని అలా జాగ్రత్త పడతారని పరిశోధకులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =