చూయింగ్ గమ్ నమలడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే కొంతమంది చూయింగ్ గమ్ మంచిదని చెబితే.. మరికొంతమంది అస్సలు మంచిది కాదంటారు.కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా జ్ఞాపకశక్తిని 35 శాతం మెరుగుపరుచుకోవచ్చని బయటపడింది. అలాగే అతిగా నమిలితే మాత్రం అదే జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉందట.
చూయింగ్ గమ్ అలవాటు ఉన్నవారిలో టీనేజర్లు ముందుంటారు. ఎవరైనా చూయింగ్ గమ్ నమలచ్చు, నమిలితే చాలా ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ చిన్నపిల్లలకు మాత్రం అస్సలు ఇవ్వొద్దట. పెద్దవాళ్లు రోజులో కేవలం ఓ గంట పాటూ నమిలితే చాలా లాభాలు కలుగుతాయని అంటున్నాయి.
బరువు తగ్గాలనుకునే వారు చూయింగ్ గమ్ నమిలితే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వారిలో ఆకలి తగ్గుముఖం పట్టి.. చిరుతిళ్లకు దూరంగా ఉంటారు. ఇప్పటికే లివర్ పూల్ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనంలో చూయింగ్ గమ్ నమిలే వారిలో కన్నా, నమలని వారే ఎక్కువ ఆహారం తింటున్నట్లు తేలింది.
దాదాపు 36 కేలరీల ఆహారాన్ని వారు ఎక్కువ ఆహారం తీసుకుంటున్నట్టు తెలిసింది. గంటపాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల 11 కేలరీలను బర్న్ చేసుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చూయింగ్ గమ్ ను నిరభ్యంతరంగా అలవాటు చేసుకోవచ్చు.
రోజూ 20 నిమిషాల పాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతాల్లో ఇరుక్కున్న ఫుడ్ తొలగిపోతుంది. దీనివల్ల దంతక్షయం నుంచి కాపాడుకోవచ్చు. చూయింగ్ గమ్ నమలడం వల్ల మెదడుకు కూడా రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలున్నాయట. అలాగే భోజనం చేశాక ఓ పావుగంట సేపు గమ్ నమిలితే అన్నవాహికలో ఆమ్ల స్థాయిలు తగ్గుతాయట. దీనివల్ల యాసిడ్ రిలీజ్ అవడం వల్ల, గుండెల్లో మంట తగ్గుతాయి.
మానసిక ఆందోళనలు, డిప్రెషన్ తో బాధపడేవారు రెండు వారాల పాటు..క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు చూయింగ్ గమ్ నమలడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని బయటపడింది.బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమిలితే మంచి ఫలితం ఉంటుంది.
చూయింగ్ గమ్ నమలడం వల్ల ఫేస్ కి ఎక్సర్ సైజ్ లా కూడా పనికొస్తుంది. డబుల్ చిన్ కూడా తగ్గుతుంది.
అయితే రోజూ చూయింగ్ గమ్ వాడేవారు షుగర్ లెస్ వి ఎంచుకోవడం మంచిది. లేకపోతే ఇతర సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.