గర్భిణీలే కాదు, సాధారణ వ్యక్తులు కూడా కుంకుమ పువ్వు తింటే ఎంతో ఆరోగ్యం

Not Only Pregnant Women But Also Normal People are Very Healthy If They Eat Saffron Flower,Not Only Pregnant Women,Normal People are Very Healthy,People are Very Healthy If They Eat Saffron Flower,Mango News,Mango News Telugu,Pregnant Women Eat Saffron Flower,Benefits of Saffron during Pregnancy,Saffron During Pregnancy,Drinking Saffron Milk During Pregnancy,Real Benefits Of Saffron During Pregnancy,Saffron Flower Latest News,Saffron During Pregnancy Latest News,Saffron Flower Uses,Benefits and Side Effects of Saffron,Saffron, Saffron Health benefits, Pregnant women, Saffron Flower

ప్రపంచంలోనే ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు (Saffron). ఇవి హిమాలయాల్లోనే (Himalayas) దొరికే అరుదైన పూరేకులు. హిమాలయ వాతావరణంలోనే కుంకుమ పూల పంట (Saffron crop) పండుతుంది. అందుకే అక్కడి నుంచే దేశంలోని నలుమూలలకి కుంకుమపువ్వు ఎగుమతి అవుతాయి. దీనివల్లే వాటి ధర కూడా అధికంగా ఉంటుంది. ఒక్క కుంకుమ పువ్వులో కేవలం మూడు రేకులు మాత్రమే లభిస్తాయి. బంగారు దారాల్లా కనిపించే ఎర్రని కుంకుమ రేకులు కిలో కావాలంటే కొన్ని లక్షల పువ్వులను ఏరాల్సి వస్తుంది. ఇందులో కూడా నాణ్యతను బట్టి ధర ఆధారపడి ఉంటుంది.

కుంకుమ పూల తోట (Saffron crop)ను పెంచడం అంత సులభం కాదు. దానికి ప్రతి పనిని పూర్తిగా చేత్తోనే చేయాలి. ఆర్గానిక్ పద్ధతిలోనే పండించాలి. మిషన్లు వాడకూడదు. ఎలాంటి మందులు చల్లకూడదు. అందుకే వీటిని పండించడం కత్తి మీద సవాలే. ప్రపంచంలోనే ఖరీదైన సుగంధద్రవ్యం ఇది. కుంకుమపువ్వును ‘సన్ షైన్ స్పైస్’ అని కూడా పిలుస్తారు. శాస్త్రీయంగా ఈ మొక్కలను సాఫ్రాన్ క్రోకస్ అంటారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎర్రటి దారాల్లాంటి కుంకుమ రేకులు (Saffron) ఉంటాయి. వాటిని సేకరించి ఎండబెట్టి అమ్ముతారు. ఈ రేకులలో మొక్కల సమ్మేళనాలు అధికం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇది ముందుంటాయి. మానసిక ఆరోగ్యానికి కుంకుమపువ్వు చాలా అవసరం. రోజూ తినే ఆహారంలో రెండు నుంచి మూడు రేకులు వేసుకొని శరీరంలో చేరేలా చూసుకోవాలి. ఇది యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తాయి. డిప్రెషన్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తాయి. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లక్షణాలు తగ్గుతాయి. జలుబు, జ్వరం రావడం తగ్గుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల జలుబు, దగ్గు, సాధారణ జ్వరం వంటివి తరచూ దాడి చేయవు. వీటిలో రిబోఫ్లేవన్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలీయంగా మారుస్తాయి.

ఒత్తిడి హార్మోన్ ను అణిచివేసే శక్తి కుంకుమ పూలకు ఉంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసోల్ అధికంగా విడుదలయితే సమస్యలు తప్పవు. అనేక రకాలుగా శరీరాన్ని కుదేలు చేస్తుంది. మెదడు పనితీరును మారుస్తుంది. ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆడవారిలో ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే కుంకుమపువ్వు రేకులను రోజు గ్లాసుడు పాలలో వేసుకొని తాగితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. మెదడు శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరంలో జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమపువ్వు రేకులను వేసి తాగితే ఎంతో మంచిది. చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మొటిమలు వచ్చే అవకాశం తగ్గి, మెరుపును సంతరించుకుంటుంది. కాబట్టి రోజుకు రెండు నుంచి మూడు కుంకుమ రేకులను తినండి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − two =