పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు. ఆయన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించారు. ఆ క్రమంలోనే తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. రచన పట్ల సినిమాల పట్ల పరుచూరి గోపాలకృష్ణ తనకున్న అనుభవాన్ని PARUCHURI GOPALA KRISHNA అనే య్యూట్యూబ్ ద్వారా అందరికి అందిస్తున్నారు. తాజాగా మహారాజ సినిమా విశేషాల గురించి చక్కగా వివరించారు. ఆ సినిమా ఎందుకు ప్రజాధారణ పొందింది. దర్శకుడు సినిమాను ఆశక్తికరంగా ఎలా తెరకెక్కించాడు అనే విషయాలను గురించి డీటెయిల్ గా చెప్పారు. మీరు కూడా మహరాజ సినిమా చూసినట్లయితే పరుచూరి గోపాలకృష్ణ గారి అనాలిసిస్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు సినిమా చూడనట్లయితే పరుచూరి గోపాలకృష్ణ అనాలసిస్ విన్నాక మీకు తప్పకుండా చూడాలి అనిపిస్తుంది.
Home స్పెషల్స్