పవన్ తో వివాదం పై స్పందించిన బన్ని మామ…

Allu Arjuns Uncle Kancharla Chandrasekhar Reddy Reacted To The Dispute With Pawan

అల్లు అర్జున్ మెగా హీరోలకు దూరమయ్యాడని.. చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే ఉహాగానాలు చాలా కాలంగా వస్తున్నాయి. అయితే ఈ ఉహాగానాలకు తోడుగా అటు నాగబాబు ట్వీట్లు మొన్నటి దాక వాటికి ఆజ్యం పోశాయి. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే అంటూ పరుష పదజాలంతో నాగబాబు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఆ కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ భావించారు. కాగా పవన్ సైతం పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటించేవారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని కార్ణాటక పర్యటనలో పవన్ కామెంట్స్ చేశారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ని సైతం అల్లు అర్జున్ కి ఆపాదిస్తూ రచ్చ చేశారు మెగా ఫ్యాన్స్.

మొన్నటివరకు ఈ వివాదం పై స్పందించని అల్లు అర్జున్ తాజా మెగాఫ్యాన్స్ కి ట్విస్ట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి బయటకొచ్చిన అల్లు అర్జున్ సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి. మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి బన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ఇది కచ్చితంగా మెగా ఫ్యామిలీకి కౌంటరిచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కాగా ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి. కల్యాణ్‌ గారు ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదు. ఆయన మాట వరసకు అలా అని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. త‌న అల్లుడు స్మగ్లింగ్ చేయలేదని… పుష్ప సినిమాలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌లా కేవ‌లం యాక్ట్ చేసాడ‌ని. అందుకే ఎన్డీయే ప్రభుత్వం సైతం నేషనల్ అవార్డు కూడా ఇచ్చిందని గర్తు చేశారు. కానీ ప్రజల్లోకి తప్పుడు సందేశం పోతోంది. పవన్ తర్వాతైనా నా ఉద్దేశం ఇది అని చెబితే బాగుండేది. ఆయనే స్వయంగా పూనుకొని సరిదిద్దితే బాగుండేదని నా అభిప్రాయం అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాగా ఈ వివాదం ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటుందోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.