టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టులో జో రూట్(103) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ 251 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 483 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక మూడోరోజు శనివారం ఆట ముగిసేసరికి 2 వికెట్లకు 53 రన్స్ చేసింది. విజయానికి లంక ఇంకా 430 పరుగుల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427, లంక 196 రన్స్ చేశాయి. ఆ తర్వాత 483 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక మూడోరోజు శనివారం ఆట ముగిసేసరికి 2 వికెట్లకు 53 రన్స్ చేసింది.
కాగా రెండు రోజుల వ్యవధిలోనే రెండు సెంచరీతో చెలరేగిన రూట్.. ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాల వీరుడిగా అవతరించాడు. చారిత్రక లండన్‌లోని లార్డ్స్‌లో జో రూట్‌కి ఇది ఏడో టెస్టు సెంచరీ. లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్ అందుకొని.. 33వ సెంచరీతో అలెస్టర్ కుక్ రికార్డు సమం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజులో పాతుకుపోయిన రూట్ శతక గర్జనతో కుక్‌ను దాటేశాడు. అంతేకాదు ఫ్యాబ్- 4లో తానే మేటి క్రికెటర్ అని ప్రపంచానికి చాటాడు. కాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి తన పైత్యానికి పదును పెట్టాడు. ఎప్పటిలాగే రూట్ వర్సెస్ విరాట్ కోహ్లీ అంటూ భారత అభిమానులను కవ్వించే ప్రయత్నం చేశాడు.
కోహ్లి-రూట్ గణాంకాలతో వాన్ పోలిక
విరాట్ కోహ్లీ మరియు జో రూట్‌ల టెస్ట్ గణాంకాల షీట్ ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వాన్.. ఈ ఫోటోకు మార్నింగ్ ఇండియా అని క్యాప్షన్ ఇస్తూ.. ఒకసారి వీరిద్దరి మధ్య గణాంకాలను పరిశీలించండి అని క్యాప్షన్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ కంటే జో రూట్ బెటర్ అని పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో భారత అభిమానులు వాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ మరియు జో రూట్ గణాంకాల గురించి మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత, భారత అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ను విమర్శించారు. రూట్ వాన్ ఇద్దరి అంతర్జాతీయ పరుగులు కలిపినా విరాట్ కోహ్లీకి సరిపోరని కౌంటర్ ఇస్తున్నారు.
కాగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 33 ఏళ్ల జో రూట్, సునీల్ గవాస్కర్, లారా, జయవర్థనే, యూనిస్ ఖాన్ లతో సంయుక్తంగా 6వ స్థానంలో ఉన్నాడు. మరొ రెండు సెంచరీ సాధిస్తే రాహుల్ ద్రావిడ్ సరసన చేరడం ఖాయం. ప్రస్తుతం రూట్ ఫామ్ దృష్ట్యా చూసుకుంటే ఖచ్చితంగా మరో 5 సెంచరీలు అవలీలగా సాధించడం ఖాయం. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే రూట్ సచిన్ 51 సెంచరీలను దాటేసిన ఆశ్యర్చపోవనవసరం లేదు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 51 టెస్టు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 1989 నుంచి 2013 వరకు ఆడిన 200 టెస్టుల్లో సచిన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో అందరూ వీడ్కోలు పలికారు. అయితే యాక్టివ్ ప్లేయర్లలో జో రూట్ మాత్రమే ముందున్నాడు.
అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్
సచిన్ టెండూల్కర్ (భారత్): 51 సెంచరీలు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా): 45 సెంచరీలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 41 సెంచరీలు
కుమార సంగక్కర (శ్రీలంక): 38 సెంచరీలు
రాహుల్ ద్రవిడ్ (భారత్/ఐసీసీ): 36 సెంచరీలు
జో రూట్ (ఇంగ్లండ్): 34 సెంచరీలు
సునీల్ గవాస్కర్ (భారత్): 34 సెంచరీలు
బ్రియాన్ లారా (వెస్టిండీస్): 34 సెంచరీలు
మహేల జయవర్ధనే (శ్రీలంక): 34 సెంచరీలు
యూనిస్ ఖాన్ (పాకిస్థాన్): 34 సెంచరీలు
అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్): 33 సెంచరీలు