ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు పనిచేసే దగ్గర వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై పోరాటం కూడా చేస్తనని ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత శ్రీరెడ్డి వ్యవహారం దారి తప్పడంతో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ మరుగున పడిపోయింది.
అయితే ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు హేమ కమిటీ నివేదిక బయట పెట్టడంతో. మరోసారి టాలీవుడ్ లో కూడా ఈ అంశం చర్చనీయాంశమయింది. మలయాళంలో హైమ కమిటీ నివేదికలో పేర్కొన్నప్పటికీ లైంగికంగా వేధించిన వారి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవలే నటి షకీలా, హీరో విశాల్ కూడా హేమ కమిటీ గురించి మాట్లాడారు. కోలీవుడ్ లోనూ హేమ కమిటీ ఏర్పాటు చేయాలనీ విశాల్ కోరారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా హేమ కమీషన్ రిపోర్ట్ పై స్పందించింది. ఈమేరకు సమంత సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. మరో పోరాటానికి సిద్దం అని చెబుతూ ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది సమంత. ఆమె పోస్ట్ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జస్టిస్ హేమ తరహాలో కమిటీని తీసుకు రావాలని సమంత కోరింది. ఉమెన్స్ వాయిస్ కూడా ఉమెన్ ఇన్ ఫిల్మ్ ఆర్గనైజేషన్ నుండి స్ఫూర్తి పొందుతూనే.. తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని తన పోస్ట్ లో పేర్కొంది సమంత. కాగా తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతున్న సమంత, అటు సోషల్ మీడియాను కూడా ఊపేస్తోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా అడుగేస్తోంది సామ్. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో లైంగిక వేధింపులపై సమంత ఇలా స్పందించడం హాట్ టాపిక్ అయింది. సమంత పోస్టుపై తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.