సైకో వర్మకు టైటిల్ ప్రాబ్లమ్

Controversy over Psycho Varma Movie Title, Latest News on psycho varma movie, Mango News, natti kranthi, psycho ram gopal varma movie, Psycho Varma Movie, Psycho Varma Movie Cast, Psycho Varma Movie Title, Psycho Varma Movie Title Controversy, Ram Gopal Varma, Ram Gopal Varma Filmography, Ram Gopal Varma lands in legal trouble

నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ట్యాగ్ లైన్. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ మళ్ళీ మెగాఫోన్ పట్టి తన తనయుడి సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. రామ్ గోపాల్ వర్మ అభిమానిగా ఈ చిత్రంలోని హీరో క్రాంతి కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు కూడా టైటిల్ విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సినిమా టైటిల్ ను మార్చమని సెన్సార్ సభ్యులు చెబుతున్నట్టు నట్టి కుమార్ తెలుపుతున్నారు. ‘సైకో వర్మ’ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు. ఇక దీనికి గాను ఆయన గతంలో సైకో పేరుతో ఎన్నో చిత్రాల టైటిల్స్ వచ్చాయని, మా టైటిల్ విషయంలో మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, దీనిపై హైకోర్టుకు వెళతామని చెబుతున్నారు.

కాగా ఈ సినిమాలో నట్టి క్రాంతి, సుపూర్ణ మలకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అప్పాజీ, మీనా, రూపలక్ష్మి, చమ్మక్ చంద్ర, కబుర్లు నవ్యా, రమ్య ఇతర పాత్రల్లో నటించారు. రవి శంకర్ సంగీతం అందిస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =