తెలంగాణ సీఎస్ మీద మోదీ సర్కార్ సీరియస్..?

Modi Sarkar Serious About Telangana CS, Modi Sarkar Serious, Serious On Telangana CS, Modi Sarkar, Revanth Reddy, Telangana CS, The Home Department, Modi Slams Revanth, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవటంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో పాటు.. ఎగువ నుంచి వస్తున్న వరద పోటుతో పలు పట్టణాలు తీవ్ర అవస్థలకు అవుతూ ఇంకా వరద ముప్పులోనే ఉన్నాయి.తెలంగాణలో నల్గొండ.. ఖమ్మం జిల్లాలు దారుణంగా దెబ్బ తినగా.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ నగరంతో పాటు..గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

తెలంగాణలో పలు చోట్ల ఇళ్లు కూలిపోవటం.. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరటం.. బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట తీవ్రనష్టానికి గురైంది. పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. దీంతో తమ రాష్ట్రానికి సాయం అందించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. అయితే తెలంగాణ నుంచి కేంద్రానికి.. తెలంగాణలో వరద నష్టం వివరాలలో ఇప్పటివరకు వెళ్లని విషయం వెలుగు చూసింది. దీనిపై తెలంగాణ సర్కారు పని తీరుపై కేంద్ర ప్రభుత్వం అసంత్రప్తిని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేంద్ర హోంశాఖ ఒక లెటర్ రాసింది.

తెలంగాణ వరద నష్టం వివరాల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపకపోవడంపై ప్రశ్నించింది. తెలంగాణలో వరద నష్టం వివరాల్ని నిర్ణీత ఫార్మాట్ లో వెంటనే పంపాలని హోంశాఖ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే 1345 కోట్ల రూపాయల ఎస్ డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని గుర్తు చేసిన హోం శాఖ.. వాటి ఖర్చుకు సంబంధించిన వివరాల్ని వెంటనే వెల్లడించాలని కోరింది.

అంతేకాదు..వరదల వేళ సాయం కోసం ఇప్పటికే 12 ఎన్ డీఆర్ఎఫ్ దళాలను.. రెండు హెలికాఫ్టర్లను కూడా పంపించినట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఎస్ డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల రిలీజ్ కోసం తక్షణమే తాము అడిగిన వివరాలు పంపాలని.. జూన్ లో రూ.208 కోట్ల విడుదలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేసింది.

అంతేకాదు..ఇప్పుడు జరుగుతున్న వరద నష్టం వివరాల్ని ఎప్పటికప్పుడు రోజువారీగా తమకు పంపాలని హోంశాఖ లేఖలో కోరింది. దీంతో.. కేంద్రం నుంచి తమకు సాయం ఎందుకు రావట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించే ముందు.. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కసరత్తు మీద ముఖ్యమంత్రి ఒక కన్నేసి ఉంచాలన్న వాదన వినిపిస్తోంది.