దేశ రాజకీయాలపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana MLC Kalvakuntla Kavitha Sensational Remarks on National Politics

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి థర్డ్ ఫ్రంట్ లాంటిదేదీ అవసరం లేదని కవిత అన్నారు. ఈ రోజు (గురువారం) కవిత భర్తతో కలిసి  తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముందు ముందు దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపడంపై ఆమె స్పందించారు. అది మంచి విషయమే కదా.. అయినా రాజకీయం వేరు.. వ్యక్తిగతం వేరు అని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే, ఒకవైపు కవిత తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేకులందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత దేశానికి థర్డ్ ఫ్రంట్స్ లాంటివి అవసరం లేదని అనటం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here