చప్పగా సాగుతున్న బిగ్ బాస్ 8..

Is He Going To Be Eliminated This Week, Aditya Om, Bejawada Bebakka, Contestants, Kirak Sita, Naga Manikantha, Nainika, Nikhil, Prithvi Raj, Shekhar Basha, Vishnu Priya, Bigg Boss, Bigg Boss Nominations, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమై అప్పుడే పదిరోజులు దాటిపోయింది. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో కంటెస్టెంట్స్ ఆమెని బాగా మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హౌస్ లో ఉన్నవారిలో కాస్త వంట బాగా చేసేది బేబక్క మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ ఏదో అలా ట్రై చేస్తున్నారు.

అయితే మరోవైపు హౌస్ లో కేవలం 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండడం వల్ల గేమ్స్ అనుకున్నంత స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ షో ప్రారంభించడానికి ముందుకు స్టార్ మా ఛానల్ లో కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్ అనే షో ప్రసారమయ్యేది. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ గేమ్ షోలో కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు అదిరిపోయేవి. ఇక్కడే టాస్కులు ఇలా ఉన్నాయంటే, ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఏ రేంజ్ టాస్కులు ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్ గేమ్ షోలో పెట్టిన గేమ్స్ ..బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు పావు శాతం కూడా ఇక్కడ ఇంకా బిగ్ బాస్ పెట్టట్లేదన్న టాక్ నడుస్తోంది. వారం రోజుల నుంచి హౌస్ లో కంటెస్టెంట్స్ ఏవో కొన్ని టాస్కులు ఆడారు, కానీ ఎలాంటి టాస్కులు ఆడారంటే చెప్పడం కూడా కష్టం అన్న వాదన వినిపిస్తోంది. కానీ వీరి మధ్య గొడవలు మాత్రం బాగా హైలెట్ అవుతున్నాయి.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లడానికి నిఖిల్, పృథ్వీ రాజ్, నాగ మణికంఠ, శేఖర్ బాషా, విష్ణు ప్రియ, నైనిక, ఆదిత్య ఓం కిరాక్ సీత నామినేట్ అయ్యారు. 13 మంది కంటెస్టెంట్స్ లో 8 మంది నామినేట్ అవ్వడం ఒక విధంగా మామూలు విషయం కాదు. వీరిలో ఆడియన్స్ అంతా కిరాక్ సీత ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.

కానీ ఓటింగ్ లైన్ ఈసారి నిమిష, నిమిషానికి ఒకలాగా ట్రెండ్ మారుతుంది. నిన్నటి వరకు కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ సరిసమానమైన ఓటింగ్ తో టేబుల్ బాటమ్‌లో ఉండేవారు. ఇప్పుడు కిరాక్ సీత, ఆదిత్య ఓం ఓటింగ్ కాస్త పెరగగా..విచిత్రంగా పృథ్వీ రాజ్ ఓటింగ్ మాత్రం అందరి కంటే చివరి స్థానంలోకి పడిపోయింది. పరిస్థితి చూస్తూ ఉంటే షో చాలా సాదాసీదాగా నడిచిపోవడంతో.. ఆ ఓటింగ్ గ్రాఫ్ మళ్లీ లేచేలా కనిపించడం లేదన్న న్యూస్ వినిపిస్తోంది.

ఒకవేళ పృథ్వీ రాజ్ కనుక ఈ వీక్ లో ఎలిమినేట్ అయితే, అది చాలా అన్యాయమైన ఎలిమినేషన్ అవుతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి పృథ్వీ రాజ్ బలంగా టాస్కులు ఆడుతున్నాడు. అంతేకాకుండా తనని తాను డిఫెండ్ చేసుకోవడంలోనూ సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే మాత్రం బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగ్స్ తగ్గిపోవడం గ్యారంటీ అంటున్నారు. ఇక ప్రస్తుతం ఓటింగ్ లైన్ లో నిఖిల్ అందరికంటే ఎక్కువ ఓట్లతో టాప్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
,,,, , , , ,,