కొద్ది గంటల్లో రూ.2వేల నోట్లు మాయం

Rs 2 thousand notes disappeared in a few hours,Rs 2 thousand notes disappeared,notes disappeared in a few hours,Rs 2 thousand notes,Mango News,Mango News Telugu,Rs 2000 notes, RBI,Rs 2000 notes disappeared, remaining Rs 12 thousand crore, Rs What is the condition of 2000 notes,2000 notes disappeared News Today,2000 notes disappeared Latest News,2000 notes disappeared Latest Updates,2000 notes disappeared Live News,2000 notes disappeared Live Updates

మీ వద్ద ఇంకా రూ.2000 నోట్ల ఉన్నాయా..? కొద్ది గంటల్లోనే ఆర్బీఐ 2వేల రూపాయల నోటు మార్చుకోవడానికి రెండోసారి ఇచ్చిన గడువు కూడా ముగిసిపోతుంది. మే 19న.. వాడుకలో ఉన్న 2 వేల రూపాయల నోట్లను ఉపసహరించుకున్నామని.. ఆ నోట్లను వెనక్కి తీసుకుంటామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి రూ. 2వేల నోట్లు వెనక్కి రావడం ప్రారంభమైంది. అయితే తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాలసీ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ రూ.2వేల నోట్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించారు.

బ్యాంకుల్లో రూ. 2వేల నోట్ల డిపాజిట్‌కు, మార్పిడికి ఉన్న గడువు మరి కొద్ది గంటల్లోనే ముగిసిపోతుంది. అంటే రూ.2000 నోట్లను మార్చుకోవడానికి అయినా.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అయినా నేటితో అంటే అక్టోబర్ 7వ తేదీ వరకే గడువు ఉంది. దీని కంటే ముందు ఈ గడువును సెప్టెంబర్ 30గా ఆర్బీఐ నిర్ణయించింది. తర్వాత దాన్ని అక్టోబర్ 7వ తేదీ వరకూ పెంచారు. 2023 మే 19న రూ.2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించగా, మే 23 నుంచి మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా రూ.2000 నోటుకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ కొన్ని వివరాలు అందించారు.

మే 23 నుంచి తిరిగి వచ్చిన రూ.3.43 లక్షల కోట్ల రూ.2వేల నోట్లలో.. 87 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చినవేనని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మార్కెట్‌లోనే స్తంభించిపోయాయని అన్న శక్తి కాంత్ దాస్.. మళ్లీ అవి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని చెప్పారు. అంతేకాదు బ్యాంకులు కూడా ఈ పెద్ద నోట్ల కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇటువంటి పరిస్థితిలో.. అక్టోబర్ 7 తర్వాత ఈ డబ్బంతా ఏమవుతుందనేది అతిపెద్ద ప్రశ్న వినిపిస్తుంది. ఈ డబ్బు వృథా అయిపోవడమేనా అన్న ఎన్నో ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

అయితే అక్టోబర్ 7, 2023 తర్వాత.. కూడా రూ. 2వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చు. కాకపోతే 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే రూ.2 వేల బ్యాంక్ నోట్ల మార్పిడికి అనుమతి ఉంటుంది. గతంలో లాగే ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.20వేల నోట్ల నగదును మాత్రమే డిపాజిట్ పరిమితి ఉంటుంది. 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో.. వ్యక్తులు లేదా ఏదైనా సంస్థలు తమ భారతీయ బ్యాంకు ఖాతాల్లోకి ఎంత మొత్తమైనా జమ చేయడానికి రూ. 2వేల నోట్లను జారీ చేయవచ్చు. పోస్టల్ శాఖ ద్వారా కూడా పెద్ద నోట్లను ఆర్బీఐకి పంపే సదుపాయం ఉంది. అంతేకాకుండా కోర్టులు, చట్టపరమైన అంశాలు అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కానీ.. ఏదైనా ఇతర పబ్లిక్ అథారిటీ విచారణ లేదా అమలులో, అవసరమైనప్పుడు, ఎటువంటి అనుమతి లేకుండా 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో.. దేనిలోనైనా రూ.2000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయొచ్చు లేదా మార్చుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =