పోలీసులు చూస్తుండగానే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు..

While The Police Were Watching The Liquor Lords Took Away The Bottle

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాటిని వరుసగా ఏర్పాటు చేశారు. సీసా సైజు, ఆకారాన్ని బట్టి ఓ గీత గీసి చక్కగా వరుసలో పెట్టారు. ఆ మద్యం బాటిళ్లను బుల్డోజర్‌తో తొక్కించడానికి సిద్దమయ్యారు. దానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే పోలీసుల ప్లాన్ ను మందుబాబులు చెడగొట్టారు. వరుసలో ఉన్న మధ్యం సీసాలపై ఒక్కసారిగా తేనెటీగల గుంపులాగా రంగంలోకి దిగారు మందుబాబులు. వీలైనన్ని సీసాలు ఎత్తుకుని పరుగులు తీశారు. ఊహించని ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ఓయ్ ఓయ్ అంటూ బెదిరించిన ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడ ఉన్నది పోలీసులు అని తెలిసిన… పట్టుకున్నది అక్రమ మద్యం అని తెలిసినప్పటకి మందుబాబులు పట్టించుకోకుండా బాటిళ్ల తో పరుగులు తీసారు.

గుంటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివిధ దాడుల్లో పట్టుబడిన సుమారు రూ.50 లక్షల విలువైన కల్తీ మద్యాన్ని ఓ డంపింగ్ యార్డు ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 24,031 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసిన ప్రజలు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అయితే ఎవరూ తమ దగ్గరకు వచ్చేందుకు సాహసించరని పోలీసులు అంచనా వేశారు. కానీ అకస్మాత్తుగా లోపలికి వచ్చిన జనాన్ని చూసి పోలీసులు ఏం చేయలేకపోయారు.  వేగంగా పరిగెత్తిన జనం అంతే వేగంగా కిందకు వంగి వీలైనన్ని సీసాలు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొందరికి ఒకటి-రెండు సీసాలు లభించగా, మరికొందరు ఐదారు సీసాలు తీసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు.

నలువైపుల నుంచి డంపింగ్ యార్డులోకి జనం దూసుకుపోతున్నా పోలీసులు ఏ చేయలేకపోయారు.  అసలు అక్కడ ఏం జరిగింది, పోలీసుల ఎదుటే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లింది ఎవరనే కోణంలో విచారణ జరుగుతోంది. కాగా మందుబాబులు చేసిన మద్యం తస్కరణ కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.